సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డి పల్లి మండలంలో గల విత్తనాల వ్యాపారులకు డీలర్లకు హెచ్చరిక మరియు నకిలీ విత్తనాలు అరికట్టడంలో డీలర్లు సహకరించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలుతీసుకొంటామని అన్నపురెడ్డిపల్లి ఎస్సై సిహెచ్ చంద్రశేఖర్ తెలిపారు... విత్తన డీలర్లతో పోలీస్ స్టేషన్లో సమావేశం ఏర్పాటు చేసి డీలర్లతో మాట్లాడుతూ విత్తన డీలర్లు రాబోయే వానాకాలం లో ప్రతి సీజన్ కు సంబంధించి పండించే పంటలకు సంబంధించి రైతాంగానికి నాణ్యతతో కూడిన విత్తనాలు అమ్మాలని అన్నారు. రైతులు నష్టపోకుండా, నకిలీ విత్తనాల బారిన పడకుండా డీలర్లు సహకరించాలని, అమ్మకాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వాలని, ఎం.ఆర్.పి. రేట్లకంటే ఎక్కువ అమ్మకూడదని,లేబుల్ లేకుండా అమ్మకూడదని సూచించారు. అనుమతిలేని విత్తనాలు, నకిలీ విత్తనాలు మార్కెట్లలోనికి రాకుండా నివారించేందుకు ప్రతి మండలంలో టాస్క్ ఫోర్స్ & ప్రత్యేక పోలీసు టీమ్లు లను ఎస్పీ రోహిత్ రాజ్ నియమించారని తెలిపారు డీలర్లందరూ వ్యవసాయ, పోలీస్ శాఖలకు సహకరించాలని, రైతులకు మేలు చేయాలని విత్తనాలు అక్రమంగా స్టోర్ చేసినా, రవాణా చేసినా, లూజుగా అమ్మినా జరిమానాతో పాటు శిక్షకు కూడా గురికావాల్సి వస్తుందని, రైతులను మోసం చేస్తున్న వారిపై పి.డి. యాక్ట్ నమోదు చేస్తామని తెలియజేశారు కాగా ఈ కార్యక్రమంలో మండల పరిధిలో ఉన్న డీలర్లు పాల్గొన్నారు. ఇలా రైతుల కష్టాలను మోసపోయిన రైతుల బాధలను అర్థం చేసుకొని వాళ్ళ బాగు కోరుకునే ఎస్సై చంద్రశేఖర్ ఈ మండలానికి వచ్చినందుకు వ్యవసాయ రైతులు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు....
-----------------------
Admin