Thursday, 30 July 2026 07:22:49 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కన్నుల పండుగగా భక్త కనకదాసు జయంతోత్సవం...

Date : 16 February 2023 11:27 PM Views : 737

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : మడకశిర నియోజకవర్గం ఆముదాల గొంది పంచాయతీ ఏ ఆర్ రొప్పంలో కురుబల ఆరాధ్య దైవమైన శ్రీ మహా భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరనోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి నీలఖంటాపురం రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న, శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ హాజరై విగ్రహావిష్కరణ చేశారు. వీరి వెంట కేసాని ఆదినారాయణ,గోరంట్ల కిష్టప్ప, పెనుగొండ పోతులయ్య, గ్రామ కురువ సోదరులు మంజునాథ్ ముత్యాలప్ప ఈశ్వరప్ప గోపాల్ రెడ్డి నర్సయ్య గౌడ హాజరయ్యారు. ఈ విగ్రహావిష్కరణ ముందు భక్తి శ్రద్దలతో, ఉపవాస దీక్ష చేపట్టారు.గ్రామంలో ప్రతి ఇంటి నుండి మహిళలు జ్యోతులు ఎత్తుకొని,ఆ మహ భక్తాగ్రేసురుడైన కనకదాసు పై ఉన్న భక్తి భావంతో సంతోషంతో మండుటెండలో, గ్రామ పుర వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ, కేరింతలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆనందోత్సవాల నడుమ భక్త కనకదాస విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కురువ సంఘం నాయకులు సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ ఏ ఆర్ రొప్పం చిన్న గ్రామమే అయినా కురువ కుల ఆరాధ్యదైవమైన శ్రీ భక్త విగ్రహం గ్రామ కురువ సోదర సోదరీమణులందరూ ఐక్యతతో సంతోషంగా విగ్రహావిష్కరణ ఒక పెద్ద పండుగగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కురభ కుల భాందవులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, పిల్లలను బాగా చదివించి, అన్ని శాఖలలోనూ ఉద్యోగాలు, మరియు రాజకీయంగా కూడా ఎదిగినప్పుడే ఐక్యతకు నిదర్శనమన్నారు. , ఇంకా సమిష్టిగా గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు రాజకీయంగా ఎదిగేందుకు మనం తోడ్పాటు అందివ్వాలని, అప్పుడే మన కులాభివృద్ధికి మనం సహాయ సహకారాలు అందించినట్లు అవుతుందని, అదేవిధంగా మన కురువ సోదరీ సోదరీమణులు ఆర్థిక ఇబ్బంధుల్లో వున్న వారికి స్తోమతిని బట్టి ఆర్థికసాయం చేసి ఆదుకోవాలన్నారు. కురభల కుల పూజ్యుడైన మహా భక్త కనకదాసును ఆదర్శంగా తీసుకుని అయన నడిచిన బాటలో పయనించేలా యువతకు స్ఫూర్తినివ్వాలని సూచించారు. మహా భక్తాగ్రేసుడైన శ్రీ కనకదాసు వంశంలో ( కులంలో) పుట్టడం పూర్వజన్మ సుకృతమని సామకోటి ఆదినారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాజప్ప, రామాంజి, ఈరన్న, రఘు, అంజన్ రెడ్డి, ఆనందప్ప, తదితర గ్రామ కురువ సోదరులు వారి బంధుమిత్రులు మహిళలు పెద్ద ఎత్తునపాల్గొన్నారు, ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన వారందరికీ గ్రామ కురువ సోదరులు భోజన వసతులు ఏర్పాటు చేశారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :