సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎలాంటి వేతనాలు లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా నడుస్తూ ఉచితంగా ప్రజాసేవ,ప్రభుత్వ సేవ చేస్తున్న జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా జర్నలిస్టు స్కీం తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24 వేల మంది పాత్రికేయ కుటుంబాల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు.మీడియా సహాయం లేకుండా ఏ ఒక్కరూ అధికారంలోకి రాలేరని తెలిపారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను నూతన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నామన్నారు. ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఉచిత విద్యుత్తు ఇవ్వడంతోపాటు హెల్త్ కార్డులు,ప్రభుత్వ గుర్తింపు కార్డులు పోలీస్ భరోసా కార్డులు ఇప్పించాలని కోరారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా చూడాలన్నారు.జర్నలిస్టులకు వృత్తిరీత్యా తగిన గౌరవ మర్యాదలు గుర్తింపును ప్రభుత్వం ఇవ్వాలన్నారు.జర్నలిస్టులకు ఇంటి స్థలాలు లేదా ప్రత్యేక గృహాన్ని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.దీంతోపాటు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన మీడియా సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డుల ఆధారంగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న వారి కి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించి జర్నలిస్టుల కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అవ్వాలని కోరారు.నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు శాసన సభ్యులందరికీ అసోసియేషన్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin