Thursday, 30 July 2026 07:39:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గిరిజన బాంధవుడు - కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్...

Date : 19 October 2023 03:56 AM Views : 550

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.. మారుమూల గిరిజన గ్రామానికి తాను అండగా నిలిచి.. విద్య వైద్యం ఉపాధి మౌలిక సదుపాయాలు కల్పించి ఆ గిరిజనుల కళ్ళలో కొత్త కాంతిరేఖలను నింపిన ఆజాద్ అధికార సేన రాష్ట్ర అధ్యక్షులు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రశాంతినగర్ పంచాయతీలోని గరిమెళ్ళ పాడు గి గిరిజన గ్రామాల సాక్షిగా తన ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆయనకు గిరిజనులు సాంప్రదాయ పద్ధతిలో ఘనస్వాగతాన్ని పలికారు. గడపగడపకు ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్న ఉదయ్ అన్నకు మనసు నిండుగా నీరాజనాలు పలికారు. దుష్టశక్తులు కుట్రలు పన్నినా.. తన రాజకీయంతో ఓటుకు నోటు వల విసిరిన మేము దేనికి వెనకాడ బోమని మీ క్షేమాన్ని మరిచి మా కోసం మా క్షేమం కోసం అను నిత్యం కష్టపడిన ఓ మహోన్నత వ్యక్తి నీ త్యాగం వృధా కానివ్వం కడదాకా మీతోటే సాగిపోతాం అంటు మెండుగా ఆశీర్వదించారు . కొత్తగూడెం నివాసి ఆర్టీసీ ముద్దుబిడ్డ స్థానికుడు.. సంస్కారం ఉన్నోడు ఎదుటి మనిషి బాధలు తెలిసినోడు.. ఆ బాధలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చిన వాడు ఇమంది ఉదయ్ కుమార్ ఆజాద్ అధికార సేన పార్టీ తరఫున కొత్తగూడెం నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో మేమున్నామంటూ గిరిజనలందరూ ఒక్కటే జై ఉదయన్న జై జై ఉదయన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో స్వార్థపూరిత రాజకీయాలకు చెక్ పెట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ ఏదో సాధించాలనే సంకల్పంతో ఈ సమర శంఖారావాన్ని పూరించానని ప్రతి ఒక్కరు తనను ఆశీర్వదించి ఎన్నికల బరిలోకి దించితే గెలుపే దిక్సూచిగా ప్రతి ఒక్కరు సైనికుల పనిచేసే నమ్ముకం నాకు ఉందని మీ మనోదైర్యమే తనకు కొండంత అండ అంటూ ఆకాంక్షించారు. ఏ సమస్యల్ని సంఘటితంగా పోరాడి సాధించుకున్నామో అదే పట్టుదలతో తనకోసం ప్రతి ఒక్కరు స్వార్థం వీడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఓటు కోసం నక్క వినయాలు ప్రదర్శిస్తూ లేనిపోని ఆశలు కల్పిస్తూ అక్కరకు రాని చుట్టంగా అనేకమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారని వారి మాటలను నమ్మవద్దని పిలుపునిచ్చారు. మీలో ఒకటిగా మీ ముందుకు వచ్చానని మనస్ఫూర్తిగా తనను ఆచరించి మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట ఇమంది కృష్ణవేణి, సమ్మక్క సీమకుర్తి రామకృష్ణ దశరథ్ రజువా గరిమెళ్ళ పాడు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: