సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఈ నెల 26 నుంచి నిర్వహించనున్న హత్ సే హత్ జోడో ను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వా ళ్ళ దుర్గా ప్రసాద్ కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. టీపీసీసీ, సీఎల్పీ ఆదేశాల మేరకు ఆదివారం సంజీవ రెడ్డి భవనం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పిసిసి సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పట్టణ, మండల,బ్లాక్ స్థాయి కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం కోసం పాకులాడుతున్నాయని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు 15 ఫైనన్స్ కమిషన్ ద్వారా ఇచ్చిన 35 వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగ చాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసి గ్రామపంచాయతీల అభివృద్ధిని అడ్డుకుంటుందఅన్నారు. స్థానిక సంస్థలు అభివృద్ధి చెందాలని లక్ష్యంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రోజ్ గార్ యోజన పేరుతో ఒక పతకం తీసుకువచ్చిందని అందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తూ వస్తుందని అన్నారు.నేడు పాలకులు గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించిన అన్ని పథకాలను నీరుగారుస్తూ నిధులను పక్కదారి మల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలే అనుకుంటే సర్పంచుల ఆత్మహత్యలూ పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేయించిన పనికి డబ్బులు రాక అప్పుల ఊబిలో కూరుకపోయి సర్పంచులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని విమర్శించారు. వీటన్నిటిని ప్రశ్నించడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ముందుకు వస్తే అక్రమ కేసుల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. యావత్ తెలంగాణ సమాజం సమస్యలపై జనవరి 26 నుండి హత్ సే హాత్ జోడో పేరుతో నిరసనలు చేపట్టనున్నామని సర్పంచులందరూ బయటికి వచ్చి తమ ఘోడును ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా గర్జించాలని పిలుపునిచ్చారు.కింది స్థాయి నుండి ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రజా సమస్యలపై పోరాడాలని హత్ సే హత్ జొడో తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వణుకు పుట్టాలని నాయకులకు సూచించారు. ప్రతి మండల నాయకులు తన మండలంలో ప్రతి గడపా తట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం అసెంభ్లీ నియోజకవర్గ పి సి సి సభ్యులు పుచ్చకాయల వీరభద్రం,మహ్మద్ జావేద్,సత్తుపల్లి నియోజకవర్గ పి సి సి సభ్యులు బైరు మనోహర్ రెడ్డి,వైరా నియోజకవర్గ పి సి సి సభ్యులు మాళోత్ రాందాస్ నాయక్,మధిర నియోజకవర్గ పి సి సి సభ్యులు శీలం ప్రతాపరెడ్డి, జిల్లా యవజన కాంగ్రెస్ అద్యక్షలు యడ్లపల్లి సంతోష్,జిల్లా మహిళా కాంగ్రెస్ అద్యక్షురాలు దొబ్బల సౌజన్య,జిల్లా యస్ సి సెల్ అద్యక్షులు బొడ్డు బొందయ్య,ఖమ్మం నియోజకవర్గ A బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు యర్రం బాలగంగాధర్ తిలక్,సత్తుపల్లి నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు గోళ్ళ అప్పారావు,మధిర నియోజకవర్గ A&B బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు చావా వేణు,కన్నెబోయిన గోపి యాదవ్,వైరా నియోజకవర్గ A బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు నున్నా కృష్ణయ్య,మండల కాంగ్రెస్ అద్యక్షులు కళ్ళెం వెంకటరెడ్డి,మట్టె గురవయ్య,అంబటి వెంకటేశ్వరరావు,వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి,కొమ్మినేని రమేష్,స్వర్ణ నరేందర్,తలారి చంద్రప్రకాష్,బొడ్డు కృష్ణయ్య,కాపా సుధాకర్,పెద్దబోయిన దుర్గాప్రసాద్,శివవేణు,కాసర చంద్రశేఖర్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ అద్యక్షులు కూరపాటి సల్మాన్ రాజు,ఎదునూరి సీతారాములు తదితర నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin