సర్కార్ టీవీ న్యూస్ / మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారం ఎర్రగుంట చెరువులో ఐదుగురు విద్యార్థులతో సహా ఒక టీచర్ మృతి చెందిన సంఘటన. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే అంబర్పేట్ కు చెందిన అబ్దుల్ రహమాన్ జావేద్ అనే వ్యక్తి అనీఫ్ మజీద్ లో మదర్సా నిర్వహించే వాడు మల్కారంలోని తాను కట్టుకున్న గృహ ప్రవేశానికి తన మదర్సలోని పిల్లలను వారి తల్లిదండ్రుల యొక్క అనుమతితో 27 మంది బాలురు 9 మంది బాలికలతో మల్కారం తీసుకొని వచ్చి కార్యక్రమం జరుగుతుండడంతో అందులో ఏడుగురు విద్యార్థులు పక్కనే ఉన్న ఎర్రగుంట చెరువులోకి ఈత కోసమని 1. ఇస్మాయిల్, 2. జాఫర్, 3. సోహెల్, 4. అయాన్, 5. రియాన్ మరియు మరొక విద్యార్థితో సహా ఏడుగురు చెరువులోకి వెళ్లడం గమనించిన టీచర్ యాహియ(25) చెరువులోకి మునిగిపోతున్న పిల్లలను రక్షించడానికి వెళ్లి అందులో ఒక్క విద్యార్థిని మాత్రమే రక్షించగలిగి మిగిలిన ఐదుగురు విద్యార్థులతో తను కూడా ప్రాణాలను కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న జవహర్ నగర్ సిఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని చనిపోయిన విద్యార్థులను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు....
-----------------------
Admin