Sunday, 01 March 2026 07:59:22 PM
# వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..? # కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

కొత్తగూడెం నియోజకవర్గ తెరాస అభ్యర్థిగా "దిండిగాల"....?

Date : 26 December 2022 10:25 PM Views : 2384

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గ తెరాస అభ్యర్థిగా "దిండిగాల"....? ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్నూరు కాపు కులస్థులు మరియు ఉద్యమకారుల ప్రసన్నం దిశగా కేసిఆర్ వ్యూహం కమ్యూనిస్టులతో పొత్తు కుదిరితే వారికి స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీకీ పరిమితం చేసే యోచన తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు తొలి మలి దశ తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషిచేసి తెరాస పార్టీ ఆవిర్భావం నాటి నుండి కేసీఆర్ కు అండగా నిలిచి అటు సమైక్యవాదం ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థలతో నడుస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ వ్యవస్థను ఎదురొడ్డి మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఉద్యమ సమయంలో ఖమ్మం జిల్లాలో ప్రత్యేక తెలంగాణ వాదాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడా పెట్టి, రాష్ట్ర సాధనకు కృషి చేయడంతో కెసిఆర్ మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడంలో దిండిగాల రాజేందర్ సప్లికృతమయ్యారు. ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీగా అవతరించిన తరుణంలో కొన్ని అనివార్య కారణాలచే జలగం వెంకట్రావును తెరాస పార్టీ నుండి బరిలో దింపాల్సి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే, కొత్తగూడెం నియోజకవర్గంలో మున్నూరు కాపుల ఓట్ల శాతం ఎక్కువగా ఉండడంతో జలగం వెంకట్రావు దిండిగాల రాజేందర్ మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ గెలుపుకు సహకరించాలంటూ కేసిఆర్ ఆదేశించడంతో పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ ఆదేశాలను గౌరవిస్తూ మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి వనమా వెంకటేశ్వరరావు వైపు మున్నూరు కాపులు మొగ్గు చూపకుండా తెలంగాణ రాష్ట్ర సమితి కీ అండగా నిలవడంలో జలగం వెంకట్రావు గెలుపు నల్లేరు మీద నడక అయ్యి దిండిగాల వ్యూహం ఫలించి , రాజకీయ వైతాళికుడిగా కీలక పాత్ర పోషించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు వివిధ రాజకీయ పార్టీల నుండి వచ్చిన వలస నాయకులతో టిఆర్ఎస్ పార్టీ నిండిపోయి పార్టీలో ఒక వర్గం దిండిగాలని విస్మరిస్తూ ఒంటెద్దు పోకడలతో కార్యక్రమాలు నిర్వహించే తరుణంలో కేసీఆర్ పసిగట్టి ఉద్యమకారుల మనోభావాలు దెబ్బతినకుండా, బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గం దూరం కాకుండా దిండిగాల రాజేందర్ కు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఇచ్చి భవిష్యత్తు రాజకీయ ఎదుగుదలకు భరోసా కల్పించడం జరిగింది. ఈ సందర్భంలో కొత్తగూడెం నియోజకవర్గంలో విచిత్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న సమయంలో సిట్టింగ్ లకే సీటు ఇస్తామన్న హామీతో అన్ని నియోజకవర్గాలలో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తుంటే ఇక్కడ వయోభారంతో బాధపడుతూ ప్రజలలో తనయుడు మీద ఉన్న వ్యతిరేకతతో కమ్యూనిస్టుల పొత్తుతో తమకు సీటు దక్కుతుందో లేదో అన్న భావనలో తెరాస కార్యకర్తలు అయోమయ పరిస్థితిలో ఉండగా కెసిఆర్ కొత్త వ్యూహం కీ తెర లేపినట్లు సమాచారం. పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా అన్ని వర్గాల ప్రజల అండదండలు ఉద్యమకారుల మద్దతుండడంతో ఎవరు కూడా దిండిగల అభ్యర్థిత్వాన్ని ఎవరు వ్యతిరేకించారు అనే భావనలో ఉన్నట్టు వినికిడి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి గా ఆవిర్భవించి ఢిల్లీలో కేంద్ర కార్యాలయం ఏర్పాటు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి దిండిగాలను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిపించుకొని నియోజకవర్గ స్థితిపై కేసిఆర్ ఆరా తీసినట్లు సమాచారం, నియోజకవర్గ జనాభా శాతంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడం దిండిగాలకు ఉద్యమకారుల మద్దతు ఉండడం కలిసి వచ్చే అంశాలు కాగా, కమ్యూనిస్టులతో సయోధ్య కుదిరితే కొత్తగూడెం నియోజకవర్గం వారు అడిగే అవకాశం ఉన్నందున వారికి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ కేటాయిస్తామని, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు ఉద్యమకారుల ఐక్యతకు కృషిచేసి రాబోయే ఎన్నికలకు పని చేసుకోవాల్సిందిగా కెసిఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరోవైపు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు కూడా కొత్తగూడెం అసెంబ్లీ నుండి పోటీ చేయాలనే ఆలోచనతో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గడల శ్రీనివాస్ కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాడే కావడంతో ఈసారి తనకే టికెట్ వస్తుందంటూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు . ఇటు మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమకారులను ప్రసన్నం చేసుకునేందుకు దిండిగాలకే ఈసారి కొత్తగూడెం నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఇచ్చే యోచనలో పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :