Sunday, 07 June 2026 10:15:50 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

బసంపల్లిలో స్మశాన స్థలం న్యాయం చేయండి మహాప్రభో...!

Date : 31 October 2022 11:06 PM Views : 394

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : స్మశాన వాటిక కోసం దళితులైన తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని అక్రమంగా,దౌర్జన్యంగా కొందరు వ్యక్తులు ఆక్రమించారని శ్రీసత్యసాయి జిల్లా బసంపల్లి గ్రామస్తులు పుట్టపర్తిలోని కలెక్టరేట్ ముందు ధర్నాకి దిగారు. ఈ సందర్బంగా వీరికి జిల్లా ఎస్సీ ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మద్దతు తెలిపారు. తమ భూమిని తమకు ఇప్పించాలని బసంపల్లికి చెందిన మాల కమ్యూనిటీ కి చెందిన దళితులు కలెక్టర్ బసంత్ కుమార్ కి వినతిపత్రం సమర్పించారు. సర్వే నెంబర్ 17-1B, 17-2 లో దాదాపు 10 ఎకరాల భూమిని గత కొన్ని సంవత్సరాలుగా దళితులమైన తామే సాగు చేస్తున్నామన్నారు. ఇందులో ఒక ఎకరా 35 సెంట్ల భూమిని స్మశాన వాటికకు దళితులకు ప్రభుత్వం కేటాయించింది. కానీ స్థానికులైన కొందరు అగ్రకులస్తులు తమకు అన్యాయం చేస్తున్నారని,...ప్రభుత్వ భూమిని బుక్కపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టార్ చేయించారని వాపోయారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గంగులయ్య , నరసింహమూర్తి , శ్రీనివాసులు మాట్లాడుతూ అస్సలు ప్రభుత్వ భూమిని బుక్కపట్నం సబ్ రిజిస్టార్ ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా బసంపల్లి గ్రామంలో జరిగిన అక్రమాలకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కావునా దయ ఉంచి దళితులమైన తమకు అన్యాయం చేయొద్దని... తమ భూమిని తమకే ఇప్పించమని శవాలు పూడ్చెందుకు కూడా తమకు స్థలం లేదని న్యాయం చేయమని కలెక్టర్ బసంత్ కుమార్ కి వారు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బసంపల్లి దళితులు కే.మల్లికార్జున , మల్లేష్ , ఎర్రి స్వామి , రామకృష్ణ , వెంకట్రాముడు , మద్దిలేటి , ఓబులేసు , వెంకటేశులు , ఈశ్వరయ్య , నాగార్జున , ఒన్నూరప్ప , ఆదినారాయణ , నరసమ్మ , రామలక్ష్మమ్మ , శాంతమ్మ , మాల మహానాడు నాయకులు కేశవప్ప , ఈశ్వరయ్య , చిన్న నాగప్ప , గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :