సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ను నిరసిస్తూ ఈరోజు నల్లమాడ మండలం కేంద్రంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు.ఈ దీక్షలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు 12 మంది టీడీపీ నాయకులు దీక్ష లో పాల్గొన్నారు. ◆ఈ సందర్భంగా మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ,... ◆ఏపీ సీఎం రావణుడిలాంటి రాక్షసుడు జగన్ రెడ్డి ◆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైస్ జగన్ దుష్ట పాలనగా సాగించాడు. ◆ఇంట్లో పుట్టిన ప్రతి పిల్లవాడికి జగన్ పేరు పెట్టాలని వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక జీవో తెస్తుందేమో. ◆వైసీపీ పాలనంతా ధ్వంసం ..విధ్వంసం తో సాగింది. ◆ జగన్ అసమర్థ పాలనతో అప్పుల్లో ఆంధ్రప్రదేశ్. ◆ ఏపీ ప్రజలకు జగన్ శనీలా దాపురించాడు. ◆ ఏపీకి ప్రధాన జీవనాడైనా పోలవరాన్ని సర్వనాశనం చేశాడు.అమరావతి రాజధానిని లేకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వ పెద్ద కంకణం కట్టుకున్నారు. ◆ అమరావతి రాజధాని రైతులు చేస్తున్న యాత్రే వైసీపీకి అంతిమయాత్రగా నిలుస్తుంది. ◆ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ బినామీ పేర్లతో లేపాక్షి ,వాన్ పీక్ వంటి లక్షల ఎకరాలు కారు చౌకగా రైతుల నుంచి కొట్టేసి లక్షల కోట్లు స్వంత ఖాతాలోకి మళ్లించారు. ◆ సీఎం పదవిని అడ్డం పెట్టుకొని జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచేశాడు. ఇసుక ,మద్యం, సిమెంట్ ,స్టీలు ధరలు పెంచి జగన్ లక్షల కోట్లు కాజేస్తున్నాడు. ◆రాష్ర్టంలో పేదలకు ఇంటి పట్టాలు, స్థలాల పేరుతో ప్రభుత్వ భూములను ,ప్రవేట్ భూములను వైసీపీ నేతలే కాజేస్తున్నారు. ◆ బీసీలకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ఎన్టీఆరే. ◆ టిడిపి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు హయాంలో ఇంటింటికి ప్రజల వద్దకు సుపరిపాలన తీసుకొచ్చిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారే. ◆ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన మహోన్నతమైన వ్యక్తిగా అన్న ఎన్టీఆర్ కే దక్కుతుంది. ◆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును అలాగే కొనసాగించేంతవరకు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ◆పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కి రాజకీయ అవగాహన లేదు. ◆అమరావతి రాజధాని అటవీ ప్రాంతంలో ఉందని పుట్టపర్తి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడడం రాజకీయ అవగాహనరాహిత్యం అన్నారు. ◆కొందరు కులం పేరుతో రాజకీయ అజ్ఞానంతో అమరావతి రాజధానిని అడ్డుకుంటున్నారే తప్ప మరొకటి లేదన్నారు. ◆పుట్టపర్తి నియోజకవర్గంలో 195 చెరువులకు నీళ్లు ఇస్తామని ప్రతిపక్షంలో ప్రగల్బలాలు పలికిన శ్రీధర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాన్ని గాలికి వదిలేశాడు. ◆ 195 చెరువులకు నీళ్లు నింపే వరకు టిడిపి పోరాటం చేస్తుందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ◆ టిడిపి ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలైన చంద్రన్న బీమా, క్రిస్మస్ కానుక, చంద్రన్న సంక్రాంతి,రంజాన్ తోపా, బిసి ఆదరణ వంటి పథకాలకు వైసిపి ప్రభుత్వం స్వస్తి పలికిందని దాన్ని అలాగే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ◆మాజీ మంత్రితో పాటు పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి నాయకులు వాల్మీకి సాధికారక కమిటీ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు 'సామకోటి ఆదినారాయణ 'మండల కన్వీనర్ మైలే శంకర్; పుట్టపర్తి మండల కన్వీనర్ విజయ్ కుమార్ ,మాజీ వైస్ ఎంపీపీ బొమ్మయ్య ,నల్లమడ మాజీ కన్వీనర్ కేశవరెడ్డి ,అన్నం లక్ష్మీనారాయణ ,మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అబ్బాస్ ఖాన్, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరు రమణ ,నల్లమాడ టిడిపి నాయకులు సలాం ఖాన్ ,మంజునాథ్ రెడ్డి ,రాయుడు నాగభూషణం, రమణ ,నాయుడు ,శివారెడ్డి ,మధు,శంకర్ ,చంద్రశేఖర్ ,చిదంబర్ రెడ్డి, కేశవ రెడ్డి, వేణుగోపాల్ ,పుట్టపర్తి నాయకులు బేకరీ నాయుడు ,మాల మనోహర్, దేవనాథ్ రెడ్డి ,మల్లాపల్లి ఓబుల్ రెడ్డి ,టీడీపీ సర్పంచ్ లు నల్లమాడ రమావత్ భారతి, పులగంపల్లి ప్రభాకర్ రెడ్డి ,బొంతలపల్లి శ్రీనివాసులు టీడీపీ నాయకులు పఠాన్ బాబావలి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin