సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం లో రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న వెన్నపూస రవీంద్రారెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకుందామని ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల్ దేవర చెరువు లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం భాగంగా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఓబులదేవర చెరువు నందు వైయస్సార్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి వేయించి గెలిపించాలని పట్టభద్రుల ఓటర్లను అభ్యర్థించడం జరిగింది . ప్రచార భాగంలో పట్టభద్రుల ఓటర్ల కు రాష్ట్ర మైనార్టీ నాయకులు తుమ్మల షామీర్ భాష మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకులు తుమ్మల షామీర్ భాష, మండల ఎంపీపీ పర్వీన్ భాను, గ్రామ కమిటీ అధ్యక్షుడు మండోజి ఆరిఫ్ ఖాన్, ఓ డి సి సర్పంచ్ గోవిందు, ఉప సర్పంచ్ నారాయణ, వార్డ్ నెంబర్ జానీ భాష, బాబాసాహెబ్ పల్లి టోపీ, బాబాసాహెబ్ పల్లి మహబూబ్ భాష, డ్రైవర్ కాజా, వైయస్సార్ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin