సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు 14.3.23. న జరుగబోవు జాతీయ నులి పురుగు నివారణా దినం పై ముందస్తు తయారీ మరియూ అవగాహనా కార్యక్రమము నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమము నందు ఎంపీడీవో పోలప్ప , ఈ ఓ ఆర్ డి రాజశేఖర్ ,మండల విద్యాధికారి ఖాదర్ వలీ భాష, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, హెల్త్ సూపర్వైజర్ విజయ కుమారి,అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య ఏఎన్ఎంలు ,ఆశ కార్యకర్తలు పాల్గొనడం జరిగినది. కార్యక్రమము ను ఉద్దేశించి ఎంపీడీఓ ప్రసంగిస్తూ రక్తహీనత ను నివారించడం లో అందరూ ప్రధాన పాత్ర పోషించాలని ఇందుకోసం ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక మాన్నయినా విజయవంతం చేయవలసిన భాద్యత ఉద్యోగులు గా అందరిది అని తెలిపారు. ఓ డి సి వైద్యాధికారి భానుప్రకాష్ కార్యక్రమ వివరాలు తెలుపుతూ 14.3.23 న అందరూ 1 నుండి 19 సంవత్సరాల వయసు పిల్లలకు నులిపురుగు నివారణా మాత్రల పంపిణీ, ఆరోజు హాజరుకాని వారికి 18.3.23 న మాపప్ రౌండ్ లో పంపిణీ చేయనున్నట్లు, ఓబుల దేవర చెరువు మండల మొత్తం 11,710 మంది ని లక్ష్యం గా చేసుకొన్నట్లు తెలిపినారు.
-----------------------
Admin