Monday, 14 September 2026 10:05:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నిరాశ్రయులకు అండగా నిలిచిన యువనేత వై. మురళీకృష్ణ యాదవ్...

Date : 03 August 2023 11:53 PM Views : 318

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రకృతి వైపరీత్యాలకు పేద ప్రజల ఇళ్లు కూలి నిరాశ్రయులయ్యారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు అండగా మేము ఉన్నాం అంటూ ఎమ్మెల్యే అంజయ్య దండు గ్రామాలకు కదిలింది. పార్టీ శ్రేణులు ప్రజా ప్రతినిధులతో పాటు ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ చిన్న కుమారుడు వై. మురళీకృష్ణ యాదవ్ సైతం గ్రామాల్లో నిరుపేదలను ఆదుకునేందుకు ముందడుగు వేశారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే అంజన్న దండు బాధితులను ప్రత్యేకంగా కలుసుకుంటున్నారు. ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు, గృహా లక్ష్మీ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. ఫరూఖ్ నగర్ మండలం మేళ్ళగూడ తండా, వెంకన్నగూడ తండా, వెలిజర్ల, గంట్లవెళ్ళి, కొండన్నగూడ గ్రామాలలో 45 మందికి వీరు సాయం అందించారు. స్థానిక ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆదేశాలతో గ్రామాలకు కదిలిన అంజన్న సైన్యం బాధితుల ఇండ్లకు వెళ్లి పరిస్థితులు సమీక్షించి వారికి ఆర్థిక సాయంతో పాటు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. అంతేకాదు ప్రభుత్వం ద్వారా గృహలక్ష్మి పథకాన్ని వర్తిస్తామని స్థానిక ఎంపీపీ ఖాజా అహ్మద్రి ఇద్రిస్ తదితర ప్రజాప్రతినిధులు ప్రకటించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని 45 మంది బాధితులకు ఆర్థిక సాయంతో పాటు నిత్యవసర వస్తువులు అందజేశామని పేర్కొన్నారు. అంతేకాదు గృహలక్ష్మి కింద ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హామీ ఇచ్చారని బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పేద ప్రజలకు అండగా నిలుస్తారని వారి యోగక్షేమాలే ఆయనకు ముఖ్యమని, ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు ఎదురైనా పేద ప్రజలకు న్యాయం చేయడం తధ్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: