సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు స్థానాలు గెలవడం ఖాయం... అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి పార్టీ ని వీడి బిఆర్ఎస్ లో చేరబోతున్న కోనేరు సత్యనారాయణ (చిన్ని) నివాసంలో ఏర్పాటుచేసిన అల్పాహారం విందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు హాజరయ్యారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు మాట్లాడుతూ.... బిజేపి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసి ఎంతో సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరున్న కోనేరు సత్యనారాయణ (చిన్ని) ని బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నామన్నారు. జిల్లాలోని ఇది ఒక శుభ పరిణామం. కోనేరు కుటుంబం జిల్లాలో సుపరిచిత కుటుంబమని, చిత్రం అనేక మందికి సేవలు అందించిన కుటుంబమని, జిల్లాలో పరిచయం ఉన్న కోనేరు కుటుంబం బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి లాభం జరుగుతుంది అన్నారు. కోనేరు సత్యనారాయణ తండ్రి కోనేరు నాగేశ్వరరావు మంత్రిగా జిల్లాకు అనేక సేవలు చేశారని ఆయన గుర్తు చేశారు, బిజెపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ మా మధ్య స్నేహ సంబంధ ఉంది మా లక్ష్యం తిరిగి బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ పిలుపుమేరకు పార్టీలో చేరడానికి కోనేరు సత్యనారాయణ ( చిన్ని) నిర్ణయం తీసుకున్నందుకు స్వాగతం పలుకుతున్నాము. కృతజ్ఞతలు ధన్యవాదాలు అన్నారు, వ్యక్తిగతంగా పార్టీ తరఫున జిల్లాలో వారి అనుభవాన్ని ఉపయోగించుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాం, ఏ పార్టీలోనైనా టికెట్ ఇచ్చే వరకు పోటీ ఉంటుంది ఆ తర్వాత కలిసిపోయాక తప్పదు అందరం కలిసి పనిచేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న బిఆర్ఎస్ పార్టీలో వర్గాలకు తావులేదు ఆయన అన్నారు, జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలో స్థానాలలో బిఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతున్నదని ఆయన అన్నారు, కోనేరు సత్యనారాయణ చిన్ని మాట్లాడుతూ... సొంత పార్టీలోకి వచ్చిన ఆనందం ఉంది అందరూ కూడా తన నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని బలపడనీయవద్దని బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు అన్నారు, భద్రాద్రి జిల్లాలో రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఐదుకు ఐదు సీట్లు గెలుచుకుంటాం పార్టీలో న్యాయం జరుగుతుంది అండగా ఉంటామని సీఎం కేసీఆర్ గారు హామీ మేరకు పార్టీలో చేరడం జరుగుతుంది అన్నారు. సీఎం కేసీఆర్ ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ దిండిగల రాజేందర్, జిల్లా గ్రంధాల సంస్థ డైరెక్టర్ శ్రీ మోరే భాస్కర్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీ షేక్ అన్వర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు యూసఫ్, చందు నాయక్, మోరేరమేష్ , పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin