Monday, 14 September 2026 05:34:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు... - ఆర్డీఓ‌ జగదీశ్వర్ రెడ్డి

Date : 11 October 2023 10:22 AM Views : 254

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల నోడల్ ఆఫీసర్ ఏఎస్పీ నాగేశ్వరరావు,డిఎస్పి ప్రకాష్ తో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని హుజూర్ నగర్ ఆర్డీవో రిటర్నింగ్ అధికారి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ ఎన్నికల నిర్వహణకు మొత్తం తొమ్మిది టీమ్ లను ఏర్పాటు చేశామని.గ్రామీణ ప్రాంతాలలో ఎంపీడీవోలు పట్టణ ప్రాంతాలలో మునిసిపల్ కమిషనర్లు నిరంతరం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉంటారని తెలిపారు.నియోజకవర్గానికి రెండు అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన మట్టపల్లి,బుగ్గ మాదారం వద్ద జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారని, నియోజకవర్గ పరిధిలో హుజూర్ నగర్ ఎన్ ఎస్ పి కెనాల్,చిల్లేపల్లి, చింతల పాలెం, మఠంపల్లి ప్రాంతాలలో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో మొత్తం 2,42,711 మంది ఓటర్ ఉన్నారని,పురుషులు 1,18,664 మహిళలు 1,24,030 ట్రాన్స్ జెండర్స్ 17 మంది ఉన్నట్లు తెలిపారు.నియోజకవర్గంలో మొత్తం 308 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నామని. ముఖ్యంగా వృద్ధులు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం కలిగిన వారికి మరియు 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు రాతపూర్వకంగా తమకు పోస్టల్ బ్యాలెట్ కావాలని ఫామ్ ఎఫ్12(డి)ద్వారా అభ్యర్థిస్తే సిడిపిఓ వారికి నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని,ఒక గెజిటెడ్ ఆఫీసర్ పోలింగ్ ఆఫీసర్ వీడియో గ్రాఫర్ సమక్షంలో రహస్య ఓటింగ్ నిర్వహించి వారి నుంచి పోస్టల్ బ్యాలెట్ స్వీకరిస్తామని తెలిపారు. ఏ ఎస్ పి నాగేశ్వర రావు మాట్లాడుతు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి రెవెన్యూ సిబ్బందితో కోఆర్డినేషన్ చేసుకుంటూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు.శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా నియోజకవర్గ వ్యాప్తంగా నిరంతరం పోలీస్ బందోబస్తు నిర్వహిస్తామని, ప్రజలు రాజకీయ నాయకులు పోలీస్ వారికి సహకరిస్తూ ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకోగలరని కోరారు.ఎన్నికలలో ధన ప్రవాహం,బహుమతులు, మద్యం, గంజాయిని నిరోధించడానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని,ఈ ఎన్నికల లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా,చట్ట వ్యతిరేక పనులు చేసినా, ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూసినా ప్రజలు సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అన్నారు.టోల్ ఫ్రీ నెంబర్ 1950 ద్వారా ఫిర్యాదులు తెలుపవచ్చునన్నారు. వాట్సాప్ గ్రూపులలో రాజకీయ,కుల,మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సంబంధిత వ్యక్తితో పాటు గ్రూప్ అడ్మిన్ లపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కాబట్టి ప్రజలు సోషల్ మీడియా అని ఉపయోగించే విషయంలో ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో సంయమనం పాటించాలని కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: