సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గత ఆరు నెలల నుండి మణిపూర్ లో అల్లర్లు చేరరేగుతూ అమాయకులైన మోతి తెగలను ఊస కోత కోస్తూ మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి హత్య చేసిన హిందూ మతోన్మాదుల ఫాసిజాన్ని వ్యతిరేకిస్తూ మోడీ రాజీనామా చేయాలని అక్కడ అల్లర్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ నేరేడుచర్ల లో ప్రజా పంథా,పి ఓ డబ్ల్యు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లన్న మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో హిందూ మతోన్మాధం పెరిగి ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాసిజాన్ని అమలుపరుస్తూ మైనార్టీలు, దళితుల పై దాడులు చేస్తూ హత్య చేస్తున్నారని అమాయకులైన మహిళల పైన అత్యాచారాలు చేస్తూ హత్య చేస్తున్నారని అందుకు ఉదాహరణే నిన్నటి మణిపూరి సంఘటనని అన్నారు మణిపురి సంఘటన దేశమంతా తలదించుకునేలా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు బిజెపి ప్రభుత్వంలో ఇతర మతాల వాళ్లు కులాల వాళ్ళు బతికే పరిస్థితి లేదని అన్నారు అందుకే మోడీని దింపపవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదని గుర్తు చేశారు మోడీనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు మరోసారి దేశంలో బిజెపి ప్రభుత్వం వస్తే దళిత మైనార్టీలు బతికే పరిస్థితి ఉండదని కాబట్టి బిజెపిని రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సయ్యద్ హుస్సేన్, కరుణాకర్ పిఓడబ్ల్యూ మండల కన్వీనర్ మరియమ్మ, పావని, సత్య అక్క తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin