Monday, 14 September 2026 12:55:58 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

2024 తరువాత మోదీ ఇంటికి.. మేం ఢిల్లీకి

Date : 19 January 2023 12:40 AM Views : 572

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : 2024లో ప్రధాని మోదీ ఇంటికి వెళతారని. తాము ఢిల్లీకి వెళతామని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం సభలో అన్నారు. బీజేపీకి పెట్టుబడిదారి దోపిడీ దారి ప్రభుత్వమని మండిపడ్డారు. దేశంలో ఎన్నో వనరులు ఉన్నాయని. కానీ వాటిని వినియోగించుకునే తెలివి కేంద్రానికి లేదని ఆరోపించారు. ప్రధాని మోదీకి ప్రైవేటైజేషన్ పాలసీ అని. తమది మాత్రం నేషనలైజేషన్ పాలసీ అని తెలిపారు. రాజకీయాలు జరుగుతుంటాయని. గెలుపు ఓటములు సహజమని కేసీఆర్ అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భారత సమాజం లక్ష్యం కోల్పోయినట్టు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అందరూ సీరియస్‌గా ఆలోచించాలని సూచించారు. దేశంలో లక్షల కోట్ల కోట్ల ఆస్తి ఉందని, ఇదంతా ఏమైతుంది అని ప్రశ్నించారు. అన్నీ ఉండి కూడా మనం ఎందుకు యాచకులం కావాలని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సభలో బీఆర్ఎస్ జాతీయ విధానం చెప్పడం సాధ్యంకాదని. త్వరలోనే వాటిని ప్రకటిస్తామని కేసీఆర్ అన్నారు. భారత్‌ అన్ని విధాలా సుసంపన్నమైన దేశమని. జలవనరులు, సాగు భూమి విషయంలో మన దేశమే అగ్రగామిగా ఉందని అన్నారు. దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందని. కానీ, కేవలం 20వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని చెప్పారు. బకెట్‌ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చైనాలో 5వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌ ఉందని. మన దేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్‌ ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు వచ్చిందని అన్నారు. కెనడా నుంచి కందిపప్పు దిగుమతి సిగ్గుచేటు కాదా? అని వ్యాఖ్యానించారు. రూ. లక్ష కోట్ల విలువైన పామాయిల్‌ దిగుమతి చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ దేశంలో అందుబాటులో ఉన్న విద్యుత్‌ 4. 10లక్షల మెగావాట్లు అని. కానీ దేశం ఎప్పుడూ కూడా 2. 10లక్షల కోట్ల మెగావాట్లు మించి వాడలేదని అన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :