సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : బస్టాండ్ సెంటర్, చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ భాష మాట్లాడుతూ. గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయమైనదనని ప్రభుత్వం తక్షణమే స్పందించి వీరికి కనీస వేతనం ఇవ్వాలని జీవో నెంబర్ 51 ని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, 60 జీవో ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఇస్తున్న వేతనాలు ఇవ్వాలని పది లక్షలు కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికుల జిల్లా జేఏసీ చైర్మన్ ఏ.జే. రమేష్ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి మురళి జిల్లా జాయింట్ సెక్రెటరీ మహమ్మద్ యూసుఫ్, కో ఆప్షన్ నెంబర్ వాడపల్లి జకరయ్య, ఏఐటీయూసీ గ్రామపంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షుడు దుంపల అమరనాథ్ గౌరవాధ్యక్షులు రామచంద్రుని కిషోర్ కుమార్ సిఐటియు సిఐటియు కార్యదర్శి డి వీరన్న ,బొల్లం వెంకన్న, ఆదిలక్ష్మి, సమ్మయ్య ,బాలకృష్ణ, బండ రామకృష్ణ, ఎనగందుల మంజుల ,జాడి సురేష్ ,ఎస్ కే సలీం ,తదితర కార్మికులు పాల్గొన్నారు..
-----------------------
Admin