సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సీజనల్ వ్యాధుల నిర్మూలన కోసం మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో దోమల మందు పిచికారి చేస్తున్నట్లు పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ తెలిపారు. శుక్రవారం పదో వార్డు లోని నెహ్రు బస్తిలో దోమల నివారణ ,సీజనల్ వ్యాధుల నిర్మూలన కోసం దోమల మందు పిచికారి ప్రారంభించి ఆమె మాట్లాడుతూ డ్రైనేజీలో ఉన్న దోమల నిర్మూలన కోసం అలాగే చెత్త చెదారం ఉన్న వాటిపై దోమల మందు పిచికారి చేయడం ద్వారా దోమ గుడ్లు పెరగకుండా నిర్మూలించబడతాయని అన్నారు. ప్రజలు కూడా తమ ఇంటి చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత ఉందని అన్నారు. పదో వార్డులో దోమల మందు పిచికారి చేయాలని కార్మికులను ఆదేశించిన మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ వర్కర్స్ ఓర్సు సందీప్ ,శాంత ,రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin