సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : జిల్లాల్లో రీసర్వే వేగవంతం చేయాలని, జాతీయ రహదారులకు భూసేకరణ, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి డా. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం రీ సర్వే, ఇంటి స్థలాలు, హౌసింగ్, వ్యవసాయ అనుబంధ శాఖలు, గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ, ఈ క్రాప్ బుకింగ్ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంబంధిత కార్యదర్శులతో అమరావతి నుండి వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు స్థానిక కలెక్టరేట్లోని ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్ , డిఆర్ఓ కొండయ్య, సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. హైవే నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పంపిణీ పై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వివరణ కోరగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర హైవే నిర్మాణంలో భాగంగా జిల్లాలో 650 హెక్టర్ల భూమిని సేకరించడం జరిగిందని ఫిబ్రవరి మాసానికి 300 హెక్టార్ల భూమికి సంబంధించిన రైతులకు న్యాయమైన పరిహారాన్ని అందించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమై జిల్లాలో చేపడుతున్న భుహక్కు భూ రక్ష రీసర్వే లో గ్రౌండ్ వ్యాలిడేషన్, డి ఎల్ ఆర్ పబ్లిష్ చేయడం హక్కు పత్రాలు అందజేయడం వంటివి ఫిబ్రవరి మాసాంతానికి సకాలంలో పూర్తి చేయాల్సి వుంటుందని అన్నారు. జాతీయ రహదారులు, ఎపి ఐ ఐ సి కొరకు భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. స్పందన అర్జీలపై సకాలంలో స్పందించి బియాండ్ ఎస్. ఎల్. ఎ కు వెళ్లకుండా అర్థవంతమైన పరిష్కారం అర్జీదారులకు చూపాలని, రెవెన్యూ అంశాలు మరింత జాగ్రత్తగా పరిశీలన,త్వరిత గతిన అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని ఈ అంశం సి.ఎం.ఓ.స్థాయిలో సమీక్షిస్తున్నారని అన్నారు. వ్యవసాయశాఖ కు సంబంధించి రబీ వరి పంటకు ఈ క్రాపింగ్ పూర్తి చేయాలని, వరి ధాన్యం కొనుగోలు కు పౌర సరఫరాల సంస్థ సన్నద్ధం కావాలని అన్నారు. సూపర్ చెక్ ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చిందని తాహసిల్డార్లు, ఆర్డీవో లు, అగ్రికల్చర్ అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు. పి ఎం కిసాన్ ఈ కెవైసి సకాలంలో పూర్తి చేయాలని, ఏదైనా తగ్గుదల ఉంటే సరి అయిన కారణాలు నివేదికలు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, సుబ్బారావు, చంద్రశేఖర్, పద్మావతి, హౌసింగ్ అధికారి చంద్రమౌళి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి రషీద్, dwma అధికారి రామాంజనేయులు, పంచాయతీరాజ్ సూపర్డెంట్ ఇంజనీర్ గోపాల్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin