Saturday, 18 April 2026 06:23:41 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

లక్ష రూపాయలు ఆర్థికసాయం..దరఖాస్తుల స్వీకరణ

Date : 07 June 2023 09:57 AM Views : 4780

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : వెనుకబడిన వర్గాల కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం (6వ తేదీ) నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నది. ఈ నెల 9న మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా లాంఛనంగా లబ్ధిదారులకు సాయం అందించడంతోపాటు అదేరోజు అన్ని నియోజకవర్గాల్లో గౌరవ మంత్రులు, ఎమ్మెల్యేలతో పథకాన్ని ప్రారంభించనున్నారు. రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం రూపొందించిన https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్‌ను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మంగళవారం ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కూడా ఆరంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, బీసీ కులవృత్తులు నిర్వహించుకొనే చేతివృత్తిదారులకు రూ. లక్ష ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వం అండగా నిలువనున్నదని చెప్పారు. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :