సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ఆదివాసి నాయకపోడు గట్టమ్మ పూజారుల ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి గారికి మరియు అదనపు రెవెన్యూ కలెక్ట వేణుగోపాల్ , ములుగు ఎంపీడీఓ , ములుగు మండల DT గార్ల ములుగు గట్టమ్మ ఎదురు పిల్ల పండగ ఆహ్వాన పత్రికను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఆదివాసి నాయకుడు ములుగు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ మాట్లాడుతూ గట్టమ్మ ఎదురు పండుగ తేదీ 14 -02- 2024 బుధవారం రోజున ఆదివాసీ నాయకపోడ్ గట్టమ్మ పూజారుల ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు గట్టమ్మ పూజారులు ప్రతి ఇంట బోనం ఎత్తుకొని అంగరంగా వైభవంగా ఆదివాసి నాయకపోడ్ ల ఆచార సంసృతి సంప్రదయముల ప్రకారం కనువిందు చేసే విధంగా నాయకపోడ్ కులదైవం లక్ష్మీ దేవర్ల నృత్యాలతో ములుగు జిల్లా కేంద్రంలోని DLR ఫంక్షన్ హల్ నుండి గట్టమ్మ దేవాలయం వరకు ర్యాలీతో 2కిలోమీటర్ల వరకు దాదాపు 2000నుండి 3000 వేల నాయకపోడ్ కులస్తులతో ఈ యొక్క ర్యాలీని నివహించడం జరుగుతుందని అన్నారు. గట్టమ్మ ప్రధాన పూజారులు గట్టమ్మ తల్లికి బోనం సమర్పించిన అనంతరం నాయకపోడ్ కులస్తుల సమ్మేళన సభను గట్టమ్మ దేవాలయం వద్ద హరిత హోటల్ పక్కన సాయంత్రం 4 గంటలకు భోజన అనంతరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ములుగు గట్టమ్మ ప్రధాన పూజారులు కొత్త సదయ్య ,కొత్త లక్మయ్యా ఆకుల మొగలి అరిగెల సమ్మయ్య ఆకుల రాజు కొత్త రమేష్ తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin