సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ యువ నాయకుడు బూసిపల్లి వెంకటరెడ్డి ని బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షునిగా నియమించి వారికి ఆట్టి నియామక పత్రాన్ని హుజూర్ నగర్ క్యాంప్ ఆఫీస్ నందు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తన చేతుల మీదుగా అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ కోసం యువత మరింతగా పనిచేసేలా వారిని కలుపుకుని చైతన్యం చేసేలా పనిచేయాలని సూచించారు.బూషిపల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ.... నన్ను గుర్తించి ఇట్టి బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ... అదేవిధంగా నాకు యూత్ అధ్యక్షుడు పదవి వచ్చేందుకు సహకరించిన మండల సీనియర్ నాయకులు మన్నెం శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య ఉపాధ్యక్షులు ఇరిగేల వెంకటరెడ్డి, మండల నాయకులు చౌటపల్లి గ్రామ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.నాపై నమ్మకం ఉంచి ఇట్టి బాధితులు అప్పగించినందుకు నా శాయశక్తుల పార్టీ కోసం పనిచేసి ఎమ్మెల్యే సైదన్నను మరలా తిరిగి గెలిపించుకునేందుకు యువతను సమాయత్తం చేసి కష్టపడి పని చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ,సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి , సీనియర్ నాయకులు గుండా బ్రహ్మారెడ్డి , మండల అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య , ఎంపీపీ మూడవత్ పార్వతీ కొండ నాయక్, జడ్పిటిసి బానోతు జగన్ నాయక్ , ధరావత్ నవీన్ నాయక్ , ఉపాధ్యక్షులు ఇరిగెల వెంకటరెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ బేత శివారెడ్డి, మండల ఉపాధ్యక్షులు కొండేటి సుధాకర్ రెడ్డి, అల్లిపురం ఉపసర్పంచి చిన్నపంగు రాజీవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బక్షనాయక్, ఇమ్మానియేల్ మఠంపల్లి మండల నాయకులు పలువురు పాల్గొన్నారు.
-----------------------
Admin