సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది బిఆర్ ఎస్ కు సీటుగా మారుతుంది.గతంలో కాంగ్రెస్ కు ఓట్లేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తే బిఆర్ఎస్ కు అమ్ముడుపోయారు.ఇప్పుడు ఓట్లేసి గెలిపించిన కూడా తిరిగి బిఆర్ఎస్ కు అమ్ముడు పొరనే గ్యారంటీ ఏంటని హుజూర్ నగర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల శ్రీలత రెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం రఘునాధపాలెం, గుండ్లపల్లి, చౌటపల్లి, బక్కమంతులగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చౌటుపల్లి గ్రామంలో మహిళలు చల్ల శ్రీలతకు తిలకం దిద్ది, హారతులు పట్టి అపూర్వ స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో సిండికేట్ రాజకీయాలు మొదలయ్యాయని శ్రీలత రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కు రాజీనామా చేసి ఎంపీ గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.కేవలం బిఆర్ఎస్ పార్టీకి లబ్ది చేకూర్చడం కోసమే రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేశారని ఆరోపించారు . హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్,బిఆర్ఎస్ లకు అవకాశం ఇచ్చిన కూడా నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందారు. బిఆర్ఎస్ పాలనలో అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదని తెలిపారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు జరిగిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిధులు ఇస్తుందని అన్నారు.సిండికేట్ రాజకీయాలు చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, సైదిరెడ్డి లకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పాలని అన్నారు.ఒక మహిళగా తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే ,ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి తీరుతామని హామీ ఇచ్చారు.
-----------------------
Admin