Wednesday, 29 July 2026 02:13:23 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా...

Date : 25 September 2023 12:33 AM Views : 458

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో రేపు నిర్వహించబోయే సాధారణ సమావేశం అవినీతి అక్రమాలతో కూడిన 18 అంశాలతో ప్రధానంగా మొక్కల పేరున "గ్రీన్ బడ్జెట్" పేరు పెట్టి మరో అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు ధ్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే అందుబాటులో లేని కారణంగా ఎమ్మెల్యే క్యాంప్ సిబ్బందికి మున్సిపాలిటీ సాదరణ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మాన కాపీ తో పాటు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మూర్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహారెడ్డి, బిజెపి నిజాంబాద్ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ పాలెపురాజు రెడ్డి మాట్లాడుతూ రేపు నిర్వహించబోయే మున్సిపాలిటీ సాధన సమావేశము 18 అంశాలతో కూడినటువంటి ఎజెండా ను పెట్ట బోతున్నామని. ప్రధానంగా మొక్కల పేరున పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు, స్కాముకు తెర లేపడం జరుగుతుందని. ఈ యొక్క స్టాండ్ గ్రీన్ బడ్జెట్ అనే పేరు పెట్టి దాదాపు 25 లక్షలు రూపాయలు స్కామ్ జరగబోతుందని. మొన్నటికి మొన్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి మూడు వేల మొక్కలు విషయం అడగడంతో ఆ మొక్కలను డంపింగ్ యార్డ్ లో పడేసి మొక్కలు నాటినట్టుగా వాటిపై కూడా డబ్బులు తీసుకోవడం జరుగుతుందని అంతేకాకుండా ఆర్మూర్లో కుక్కల బెడద,పందుల బెడద,దోమల బెడద, చివరికి కోతుల బెడద, తీవ్రమైపోయినప్పటికీ అదే విధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి రోడ్డు భయానకంగా మారి ఆ రోజుల్లో నడిచినా, ప్రయాణం చేసిన ఆస్పత్రి పాలు కావడం గ్యారెంటీగా మున్సిపాలిటీ పనిచేస్తా ఉందని అలాంటి విషయంలో చొరవా చేసుకోవాల్సిన మున్సిపాలిటీ అవినీతి అక్రమాలకు భూకబ్దలకు తప్ప అభివృద్ధి నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆర్మూర్ మున్సిపాలిటీ ఉందని జూన్ 2 నా జరిగే తెలంగాణ ఆవిర్భావ సంబరాలకు తీసుకువచ్చినటువంటి మిఠాయిలకు సైతం 33 వేల రూపాయలు ఖర్చు అయినట్టుగా దొంగలెక్కలు రాయడం జూన్ 2 యొక్క సందర్భాన్ని అవమానపరిచినట్టుగానే భారతీయ జనతా పార్టీ భావిస్తుందని. అంతేకాకుండా మిషన్ భగీరథ పేరున ప్రజలకు ఉచితంగా నీళ్లుఇస్తామని చెప్పినటువంటి ఈ నీళ్లను ప్రతినెల 100 రూపాయలు చొప్పున ప్రజల తెలియజేయకుండానే తీసుకొని అవినీతికి పాల్పడతా ఉన్నారని. అంతేకాకుండా ఆర్మూర్ మున్సిపాలిటీలో బోర్లు చెడిపోతున్నాయని చెప్పి రిపేర్ల పేర్లతో ప్రతి బడ్జెట్లో పది లక్షల పైన బిల్లులు పెట్టడం జరుగుతా ఉందని. అదేవిధంగా రోడ్లలో మొహరం వేస్తున్నామని చెప్పి మరణం వెయ్యకుండానే లక్ష రూపాయలు వేచి చూస్తున్నట్లుగా రికార్డులలో దొంగ లెక్కలు చూపిస్తున్నారని ఎటువంటి కమిటీలు లేకుండా ప్రతిపక్షాలతో చర్చించకుండానే హిస్టారిచ్చిన వ్యవహరిస్తున్నారని అవినీతికి పాల్పడడం అక్రమాలకు పాల్పడడం దొంగలెక్కలు సమర్పించడంలో ఆది చేరిపోయినటువంటి మున్సిపాలిటీ కమిషనర్ను సస్పెండ్ చేయాలని దీంట్లో భాగస్వామ్యం మున్సిపాలిటీ చైర్మన్ రాజీనామా చేయాలని అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయ్ సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రజలు తరిమి వేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. టిఎస్ బిపాస్ ప్రకారం ఏదైనా పని చేసిన కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారానే ఆర్మూర్ అభివృద్ధికి పాల్పడాలని అలాంటివేమీ లేకుండానే ఇష్ట రీతిన వ్యవహరించడం ( జిస్కే హత్ మే లార్టి - ఉష్ కా బైస్ ) ఎవరి చేతిలో కట్టే ఉందో వారిదే బర్రె నానుడిగా బి ఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఉందని. ఆర్మూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కలెక్టర్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్న కలెక్టర్ సైతం నిసై జమైన అచేతన స్థితికి చేరుకున్నారని. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండడం మన ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రజలు చేసుకున్న దురదృష్టమని. ప్రజలు ఈ విషయాలన్నీ గమనించి రాబోయే కాలంలో ఈ అవినీతి, అక్రమాలు చేస్తున్నటువంటి బి ఆర్ఎస్ నాయకులకు ప్రజాప్రతినిధులకు ఓటు అనే ఆయుధంతో తరిమి తరిమి పంపించేయ్యా లని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ఇట్టి కార్యక్రమంలో బిజెపి మరియు వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: