సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ లో సోమవారం పాండవుల చెరువు వద్ద గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం కార్తీక వనభోజన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ Nc.రాజమౌళి, కౌన్సిలర్స్ ఉప్పల మెట్టయ్య, అత్తెల్లి శ్రీనివాస్,నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేతి చిన శ్రీనివాస్, ఆర్యవైశ్య నాయకులతో కలిసి కార్తీక వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ పరిధి లోని ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పెద్ద యెత్తున పాల్గొనడం సంతోషకరం అని కార్తీక వనభోజనాలు కార్యక్రమం నిర్వాహకులను అభినందించారు, వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఉండాలని ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని సీఎం కెసిఆర్ ఆర్యవైశ్యుల కోసం కేటాయించిన భూమిలో ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్, మరియు ఆర్యవైశ్యుల విరాళాలతో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం నిర్మించడం జరుగుతుందని అన్నారు ముందుగా వాసవి కన్యకా పరమేశ్వరి మాతను స్మరించి, తులసీ దామోదర కల్యాణం,గోమాత పూజ,నిర్వహించి, అరటి ఆకులలో సహపంక్తి భోజనం కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన వారికి భాహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా యువజన అధ్యక్షులు నేతి చిన సంతోష్, కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు సిద్ది బిక్షపతి మాజీ వైస్ ఎంపీపీ అత్తెళ్ళి లక్ష్మయ్య,ఓంకార్ , భద్రయ్య,తోట బిక్షపతి, ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూర ఆంజనేయులు,గుడాల రాధా కృష్ణ, దొంతుల సత్యనారాయణ, రుక్మయ్య, సిద్దిపేట శ్రీనివాస్, కొమర వెళ్ళి శంకరయ్య, ఆదిమూలం నారాయణ, కొమర వెళ్ళి ప్రవీణ్,సంపత్, శివ కుమార్, నాగేంద్రం, రుక్మయ్య, దూభకుంట ప్రభాకర్, లచ్చలు,లక్ష్మణ్, పొద్దుటూరి, చంద్ర శేఖర్, చంద నాగభూషణం,విశ్వనాథం,శేకరయ్య,రమేష్, ఆర్యవైశ్య నాయకులు మహిళలు,యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin