Monday, 14 September 2026 09:22:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఉత్తమ్ హయాంలోనే అభివృద్ధి...

Date : 31 October 2023 02:52 AM Views : 215

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్, టిపిసిసి మాజీ అధ్యక్షులు, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాం లోనే నియోజకవర్గం అనేక రకాలు గా అభివృద్ధి జరిగిందని జెడ్ ఆర్ యు సి సి మెంబర్, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ యరగాని నాగన్న గౌడ్ గుర్తు చేశారు. హుజూర్ నగర్ మండల పరిధిలో గల బూరుగడ్డ, మాచవరం కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ కమిటీ ల సభ్యులు రానున్న నెలరోజుల పాటు శక్తి వంచన లేని కృషిచేసి ఉత్తమ్ ను గెలిపించాలని కోరారు. దక్షిణాదిలోనే అతి గొప్ప దేవాలయంగా పిలవబడే బూరుగడ్డ లో వేంచేసిన శాల్మలి కంద వేణుగోపాల ఆది వరహా లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని 1 కోటి 45 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 11 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి కరెంట్ కోతలను నీవారించారాని తెలిపారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు అదనపు గదులను నిర్మించారని, గ్రామంలోని సిసి రోడ్లు ఉత్తమ్ హయాంలో వేసినవేనని చెప్పారు. బూరుగడ్డ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, గ్రామ సర్పంచ్ ఎన్నికల సమయంలో ఎక్కడెక్కడ వారినో ఊర్లో తిప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొంది గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారి కోసం అందించే ఆరుగ్యారంటీలను గురించి వివరించారు. హస్తము గుర్తుపై ఓట్లు వేసి ఉత్తమ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మాజీ డిసిసిబి డైరెక్టర్ ఈడుపుగంటి సుబ్బారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ముఖ్ టిపిసిసి ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, బాచి మంచి గిరిబాబు ఎంపీటీసీ సందీప్,అదేర్ల శ్రీనివాసరెడ్డి, శివరాం యాదవ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మేకపోతుల వెంకయ్య,చేన్నగాని బాలకృష్ణ గౌడ్, బూరుగడ్డ గ్రామ శాఖ అధ్యక్షులు యరగాని బిక్షం, మాచవరం గ్రామ అధ్యక్షులు గడ్డం నాగయ్యయాదవ్, యరగాని గురవయ్య, నరసింహారావు ఎర్రగాని సైదులు , , గడ్డ సత్యం, ఎరగాని వెంకన్న, బత్తిని వీరబాబు చిమట సైదులు, గూడెపు సాంబయ్యతదితరులు ఉ పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: