సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : కాంగ్రెస్ భవన్ నిజామాబాద్ లో బిసి సెల్ జిల్లా అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్, నందిపేట్ మండల్ బిసి, సెల్ అద్యక్షులుగా గోజ్జి రాజేందర్ మరియు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ముప్ప గంగారెడ్డి, నందిపేట్ మండల్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా దమ్మాయి శ్రీనివాస్ ను నియమించి నియామక పత్రాలు అందజేశారు. వారికీ మండల్ కాంగ్రెస్ పార్టీ తరుపున ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నుకోబడ్డ బీసీ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మండలంలో పార్టీ పటిష్ఠతకు ఎంతో కృషి చేయాలని మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్ అన్నారు.నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో నందిపేట్ మండల అధ్యక్షులు మంద మహిపాల్,జిల్లా నాయకులు వైయస్ గంగాధర్, కల్లెడ శ్రీనివాస్, శివకుమార్,శశి,మరియు ఫిరాజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin