సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి : జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని అన్నపురెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వనమా గాంధీ అన్నారు.సిద్దిపేట మండలం బక్రీద్ చెప్పాలా గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయటాన్ని వనమా గాంధీ తీవ్రంగా ఖండించారు.పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన దుండగులను గుర్తించి వెంటనే అరెస్టు చేసి వారు కఠినంగా శిక్షించాలని,శాంతి మార్గంలో దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేయటం దుర్మార్గమైన చర్య అనీ అని ఆవేదన చెందారు.
-----------------------
Admin