Thursday, 30 July 2026 04:24:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అమ్మాయి నుంచి మెసేజ్ దిమ్మతిరి బొమ్మ కనిపించింది...

Date : 23 June 2023 04:57 PM Views : 581

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : ఆయన వయసు 79.. అమ్మాయి నుంచి మెసేజ్ రాగానే ముందు వెనుకా ఆలోచించకుండా టెంప్ట్ అయిపోయాడు. న్యూడ్ వీడియో కాల్ చేయగానే సంబరపడిపోయాడు. కట్ చేస్తే దిమ్మతిరి బొమ్మ కనిపించింది. నన్ను కాపాడండి అంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇంతకీ ఆ వృద్ధుడు ఏం చేశాడు? అమ్మాయి ఏం చేసింది? పోలీసులను ఎందుకు ఆశ్రయించాడు? అసలీ ఘటన ఎక్కడ జరిగింది? ఈ క్రైమ్ కహానీ ఏంటో తెలుసుకుందాం...హైదరాబాద్‌కు చెందిన 79 ఏళ్ల వ్యక్తికి వాట్సాప్‌లో ఓ అమ్మాయి మెసేజ్ చేసింది. ఎవరు? ఏంటి? అని ఆలోచించకుండా అతను అమ్మాయితో చాటింగ్ చేశాడు. ఆ తరువాత న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుదామంటూ కవ్వించింది. అయితే, తాను బయట ఉన్నానని ఆయన చెప్పడంతో.. మరికొద్దిసేపట్లో కాల్ చేస్తానని, బాత్రూమ్ నుంచి వీడియో కాల్ మాట్లాడుదామని అడిగింది. దాంతో టెంప్ట్ అయిన ఆయనగారు.. ఇంటికెళ్లి, బాత్రూమ్‌లో గడియ పెట్టుకుని వీడియో కాల్ చేశాడు. ఇంకేముంది, ఈయనకు అసలు కథ తెలియదు కదా.. అటు నుంచి వీడియో కాల్ స్క్రీన్ రికార్డ్ చేశారు. ఆ తరువాత కొంతమంది వ్యక్తులు వృద్దుడికి కాల్ చేసి సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియో సెండ్ చేస్తామని బ్లాక్‌మెయిల్ చేశారు. కాసేపటి తరువాత పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న మరో వ్యక్తి పోన్ చేసి కేసు బుక్ అయ్యిందని భయపెట్టాడు. దాంతో వారు అడిగినంత సమర్పించుకున్నాడు. మూడు రోజుల్లో మొత్తం రూ. 15 లక్షలు వసూలు చేశారు. ఇంకా డబ్బులు కావాలని వారు డిమాండ్ చేయడంతో.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :