సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఫరూక్ నగర్ : షాద్ నగర్ పట్టణ సిఐ ప్రతాప్ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామ దేవశ్రీ కంపెనీ ముందు ఒక గుర్తు తెలియని మగ మనిషి వయస్సు 35 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి చనిపోయి పడి ఉన్నాడని పేర్కోన్నారు. అతనిని రాత్రి సమయంలో ఏదో గుర్తుతెలియని వాహనము అతన్ని ఢీ కొనగా మృతుడు అక్కడికక్కడే చనిపోయినట్లుగా పేర్కొన్నారు. శవాన్ని గుర్తించిన వారు అటు సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేసి సహకరించగలరని వారు కోరారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
-----------------------
Admin