సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ చెన్నారావుపేట మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చెన్నారావుపేట మండలానికి 56 చెక్కులు,నెక్కొండ మండలానికి 34 చెక్కులు కలిపి మొత్తం 90 మంది లబ్ధిదారులకు సుమారు రూ.91 లక్షలు విలువైన చెక్కులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వివాహం చేసుకున్న మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఒక్కొక్కరికి లక్ష వేయి రూపాయల చొప్పున అందించడం జరుగుతుందని,తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఎప్పుడు పేదల పక్షపాతిగా ఉంటుందని, రాష్ట్రంలోఅన్ని వర్గాల ప్రజల అభివృద్ధియే ధ్యేయంగా ముందుకు పోతున్నదని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా తోడ్పాటు అందిస్తుందని,అందుకే వారి పేరుపై ఉచిత విద్యుత్తు, సబ్సిడీకి గ్యాస్,వడ్డీ లేని రుణాలను మహిళలకు అందిస్తూ వారు అభివృద్ధిని సాధించే విధంగా కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్, నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్లు చల్లా శ్రీపాల్ రెడ్డి,ఆవుల శ్రీనివాస్, మాదటి శ్రీనివాస్, భూక్యా గోపాల్ నాయక్ , మొగిలి వెంకట్ రెడ్డి, నెక్కొండ తహసిల్దార్ రాజకుమార్ ఎంపీడీవో యాసo లావణ్య, పీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి , పెండెం రామానంద్, ఎక్కకుండా నెక్కొండ, చెన్నారావుపేట,మండల కాంగ్రెస్ అధ్యక్షులు లావుడియా తిరుమల్, సిద్ధేన రమేష్ ,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బక్కి అశోక్, కార్యదర్శి కుసుమ చేన్నకేశవులు, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి సాయి కృష్ణ, నెక్కొండ ఉప సర్పంచ్ సింగం శ్రావణి ప్రశాంత్,వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్లు,వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు,సంబంధిత అధికారులు,లబ్ధిదారులు , కాంగ్రెస్ ముఖ్య నాయకులు వివిధ గ్రామాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter