సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట మండలం గురజాలకు చెందిన మంచి కసాయి (23) అనే యువకుడు ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుజాలకు చెందిన నలుగురు యువకులు ఆదివారం కారులో కాలేశ్వరం పుష్కరాలకు వెళ్లి... మేడారం నుంచి తిరిగి వస్తుండగా సోమవారం తెల్లవారుజామున తాడ్వాయి వద్ద కారు చెట్టుకు ఢీకొన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో సాయం మృతి చెందాడని తెలిపారు.
-----------------------
Reporter