Thursday, 30 July 2026 07:28:20 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సిపిఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా...

Date : 03 September 2023 01:24 AM Views : 382

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : దక్షిణాది ప్రాంతాల రైల్వే వ్యవస్థపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వివక్షత ప్రదర్శిస్తోందని, తరతరాలుగా జరుగుతున్న ఈ అన్యాయంపై ఈ ప్రాంత ఏంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రలు గొంతు విప్పాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాచలం రోడ్, కొత్తగూడెం, మణుగూరు రైల్వే స్టేషన్ల నుంచి రద్దు చేసిన నాలుగు రైళ్ళను పునరుద్దరించడంతోపాటు తిరుపతి, కొవ్వూరు రైల్వే సర్వీసులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిదిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ రైళ్లను, రైల్వే స్టేషన్లను కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టే విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న కేంద్రం వాటిని అభివృద్ధి చేయడంలో శద్దలేదన్నారు. నూతన రైళ్ళ ఏర్పాటు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కేంద్ర దయాదాక్షిణ్యాలపై ఆదారపడి ఉంటోందని, కేంద్రం ముందు మోకరిల్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. దక్షిణాది రైల్వే వ్యవస్థకు బడ్జెట్ కోతలు విధిస్తుంటే అడిగే నాదుడే కరువయ్యాడన్నారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన ఈ ప్రాంత ఎంపీలు, ముఖ్యమంత్రులు మొద్దు నిద్ర పోతున్నారా అని ప్రశ్నించారు. కరోనా సాకుతో వందలాది రైల్వే సర్వీసులను రద్దు చేసి ఇప్పటికీ ఆ రద్దును కొనసాగిస్తుంటే ఇక్కడి ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. కేంద్రంతో లాలూచి పడి, స్వప్రయోజనాలకోసం మోడీ ముందు మోకరిల్లుతున్నారే తప్ప ప్రజల కష్టాలను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎ.కె.సాబీర్ పాషా మాట్లాడుతూ కొత్తగూడెం, మణుగూరు రైల్వే స్టేషన్ల నుంచి సింగరేణి, విజయవాడ, ఖాజీపేట, డోర్నకల్ తదితర రైళ్ళను రద్దు చేసి నెలలు గడుస్తున్నప్పటికి ఎంపీలు, ఎమ్మేల్యేలు నోరుమెదపరెందుకని ప్రశ్నించారు. భద్రాచలం రోడ్ స్టేషన్ ద్వారా రైల్వే శాఖకు బొగ్గురవాణా, ప్రజారవాణా ద్వారా ఏడాదికి రూ. వెయ్యి కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోందని, పెద్ద మొత్తంలో ఆదాయం దండుకుంటున్న రైల్వే శాఖ స్టేషన్ అభివృద్ది, రైళ్ళ పునరుద్ధరణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. రైళ్ళను పునరుద్దరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం రైల్వే అధికారులకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు కె.జమలయ్య, వాసిరెడ్డి మురళి, కందుల భాస్కర్, గెద్దాడు నగేష్, గనిగండ్ల వీరస్వామి, భూక్య శ్రీనివాస్, ఎస్.కె.ఫహీమ్, నాయకులు మాచర్ల శ్రీనివాస్, చింతాల రాజు, పోగుల కోటేశ్వర్రావు, పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, సందెబోయిన శ్రీనివాస్, అబ్బులు, విజయలక్ష్మి, షాహీన్, ఖయ్యూమ్, షమీమ్, బాగం మహేశ్వర్రావు, బత్తుల నాగరాజు, నర్సింహారావు, కత్తెర రవీందర్, కొచ్చెర్ల జోసఫ్, రాచర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: