సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : మాజీ బిజెపి జిల్లా అధ్యక్షుడుగా ఉన్న కోనేరు సత్యనారాయణ ను శాలువా కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కోనేరు సత్యనారాయణ తండ్రి అయిన కోనేరు నాగేశ్వరరావు గారిని ఈ ప్రాంతంలో తెలియని వారెవరు ఉండరని ఎమ్మెల్సీ తాతా మధుగారు పేర్కొన్నారు... ముఖ్యమంత్రి కేసీఆర్ కి కోనేరు నాగేశ్వరరావు కి గతంలో తెలుగుదేశం పార్టీలో మంచి సంబంధాలు ఉండేవని, కోనేరు సత్యనారాయణ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా టి ఆర్ ఎస్ లోకి రావాలని నేను [ఎమ్మెల్సీ తాతా మధు], రేగా కాంతారావు, నామా నాగేశ్వరరావు ఆహ్వానించడం జరిగిందని తాతా మధు గారు కొనియాడారు. ఈ మధ్యనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం జరిగిందని ముఖ్యమంత్రి కూడా కోనేరు సత్యనారాయణ బి ఆర్ ఎస్ పార్టీలోకి రావాలని, వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్సీ తాతా మధుగారు పేర్కొన్నారు. కోనేరు సత్యనారాయణ తండ్రిగారైన కోనేరు నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతానికి సుపరిచితులని ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలుగుదేశం ఎన్టీఆర్ నాయకత్వంలో పనిచేశారని గుర్తు చేశారు ఒక మంచి పని కోసం తెలంగాణ ప్రజలు కోరుకునే విధంగా పనిచేయాలని తెలంగాణ సాధించడం కోసం తెలంగాణ ప్రజల సహకారంతో ఆ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కొత్తగూడెం ప్రాంత ప్రజలు సింగరేణి బిడ్డల సహకారంతో తెలంగాణ సాధించుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.
-----------------------
Admin