Saturday, 18 April 2026 08:09:31 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

18 సంవత్సరాల నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని...

Date : 09 November 2022 11:32 PM Views : 359

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి మండలం బీడుపల్లి లోని సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థులకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్వీప్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణను విడుదల చేసిన నేపథ్యంలో ఓటరు జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, తప్పుగా ఉన్న పేర్లు, చిరునామాలు ఇతర విషయాలను సవరణ చేసేందుకు వెసులుబాటు ఉందని తెలిపారు. అలాగే నూతన ఓటనమోదుకు ఫారం -6 ,ఓటరు జాబితా నుండి పేరు తొలగింపు కోసం ఫారం - 7 అలాగే నివాస ప్రాంతం అడ్రస్ మార్పు కొరకు ఫారం -8 ఒకే నియోజ క వర్గములో ఒక పోలింగ్ స్టేషన్ నుండి మరొక పోలింగ్ స్టేషన్ కు మార్పుకోసం ఫారము 8-ఎ ను, ఫారము 6-ఏ ను యన్.ఆర్.ఐ లు కూడా ఉపయొగించ వచ్చునని మరియు ఓటరు కార్డు కు ఆధార్ అనుసందానము కొరకు ఫారము 6-బి ను ఉపయొగించ వచ్చునని కలెక్టర్ సూచించారు. ఓటు హక్కు సంక్షేమానికి, అభివృద్ధికి పునాది లాంటిదని పేర్కొన్నారు. అర్హత కలిగిన వారందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాలని ఇది నిరంతర ప్రక్రియఅని తెలిపారు. నియోజకవర్గ ప్రాంతాలలో ఏర్పాటుచేసిన బిఎల్ ఓ ల ద్వారా ఓటు నమోదు, ఆధార్ లింకేజీ , ఆన్లైన్ ద్వారా www.ceoandhra.nic.in or Nvsp portal ద్వారా ఓటరు నమోదు చేసు కోవచ్చునని కలెక్టర్ వివరించారు. నేటి యువత విద్యతోపాటు నైతిక విలువలను పెంపొందించుకున్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశం, రాష్ట్రం ,జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ప్రజలకు సుపరిపాలన అందించే ఒక మంచి లక్షణాలు కలిగిఉన్న అభ్యర్థిని నిర్ణయించుకొని ఎన్నికల సమయంలో ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలన్నారు. ప్రతి పౌరునికి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులలో ఓటు హక్కు ఎంతో ప్రధానమైనదని తెలిపారు. సమాజంలోని విద్యావంతులు, ప్రజలు ఓటు విలువ తెలుసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో నిజాయితీగా ఓటు వేయాలని ఎలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసం పాటుపడే వారిని ప్రోత్సహించాలన్నారు.. జిల్లాలో సుమారు 20 లక్షల మంది జనాభా కలిగి ఉండగా ఇందులో 13 లక్షల మంది ఓటర్లు నమోదు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా యువత ఓటరుగా నమోదు కార్యక్రమాల్లో చైతన్యవంతులుగా ఎదగాలన్నారు. రాబోయే జనవరి మాసంలో జాతీయ ఓటర్ల దినోత్సవం నాటికి ఓటరు గుర్తింపు ఏపిక్ కార్డు కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. వచ్చే అన్ని ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గత రెండు మాసాలుగా రూపొందించిన ఓటర్ల సవరణ జాబితా జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ భాగ్యరేఖ, పుట్టపర్తి తాసిల్దార్ దేవేంద్ర నాయక్, ఎన్నికల విభాగం తాసిల్దార్ నరసింహులు, స్పందన తాసిల్దార్ గోపాలకృష్ణ, ప్రిన్సిపాల్ డా. సింధిల్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ నాగరాజు హెచ్.ఓ.డి. రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :