సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ :కాంగ్రెస్ కు ఓటు వేస్తే మనకి మిగిలేది.. మొండి చెయ్యేనని... ప్రజా శ్రేయస్సు కోరే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ గెలుపొందిన నాటి నుండి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. మొండోనిరాయి తండా నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు. రూ. 1.34కోట్లతో సిసి రోడ్డు నిర్మాణం పనులు, అంతర్గత మురుగు కాలువలు. ఆసరా పింఛన్ ధ్వారా 2014 లో 152 మందికి గాను ప్రతి నెల 33900/- మాత్రమే వచ్చేవి.. ప్రస్తుతం 186 మందికీ 3,06,000/- రూపాయలు వస్తున్నాయి. రైతు బంధు లబ్ధిదారులు 514 మంది, 4.29 కోట్లు, రైతు రుణమాఫీ లబ్ధిదారులు 314 మంది, 1.94 కోట్లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులు 56 మంది, 56.06 లక్షలు, శ్మశానవాటిక నిర్మాణము కోసం 25 లక్షలు. ఆర్ అండ్ బి రోడ్ నుండి మొండోని రాయి తండా 40 లక్షలు, షాద్ నగర్ నుండి అయ్యావారిపల్లి 9 కోట్లు, మొగిలిగిద్ద నుండి చౌలపల్లి 3.2 కోట్లు, 89 లక్షల వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా 3 ట్యాంకుల నిర్మాణంతో 464 ఇండ్లకు త్రాగునీటి సరఫరా. మిషన్ కాకతీయ ద్వారా 38.8 లక్షల తో వీరంకుంట చెరువు, 10.20 లక్షల తో తెట్టకుంట చెరువు పూడికతిత, గ్రామ పంచాయితీ భవనం 20 లక్షలు, చౌలపల్లిలో ఎస్సి కమ్యూనిటీ భవనం 10 లక్షలు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కారుగుర్తు పార్టీకి అండగా ఉంటూ కారుగుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించాలనీ అభివృద్ధిని కొనసాగిద్దామని ఈ సందర్భంగా ప్రజలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రిస్, సర్పంచ్ రుక్సానా బేగం, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin