సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలోని బర్లి ఫీట్ ఏరియా మస్జిద్- ఎ- ఇబాదుర్ రెహమాన్ ఆధ్వర్యంలో సుమారు 40 రోజులపాటు నమాజు చదివిన ముస్లిం పిల్లలకు 30కి పైగా సైకిల్లు బహుమతిగా ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో షేక్ నూరుద్దీన్ ఉమ్రి హైదరాబాద్, షేక్ అబ్దుర్ రెహమాన్ గుంటూరు, జిలాఏ అమీర్ జమైతే అహేల్లే, హదీస్, షేక్ అబుల్ కలాం రియాజి కొత్తగూడెం వారు ప్రసంగించారు. వీరు మాట్లాడుతూ పిల్లలు సమాజంలో ఏ విధంగా మెలగాలి తల్లిదండ్రులను గౌరవించాలని సమాజంలో చైతన్యవంతులుగా జీవించాలని స్త్రీలను గౌరవించాలని తోటి వారితో స్నేహపూర్వకంగా ఉండాలని నమాజు పైన మక్కువ పెంచుకోవాలని అన్నారు. అల్లాహ్ చూపిన మార్గంలో నడవాలని, యువత సేవా కార్యక్రమాలు చేయాలని, కులమత బేధాలు లేకుండా దానధర్మాలు చేయాలని, రాబోయే రంజాన్ నెలలో నిష్టగా ఉండాలని, కోరారు. చెడు మార్గాల వైపు వెళ్లొద్దని తోటి వారిని కూడా వారి జీవన శైలి మారేలా మంచి మార్గాన్ని చూపించాలని కోరారు.మగ్రిబ్ నమాజు తర్వాత ప్రారంభమైన ఈ కార్యక్రమం సుమారు మూడు గంటల పాటు సాగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్త్రీలు, పిల్లలు, యువకులు, భారీ సంఖ్య లో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇంత ఘనవిజయం సాధించినందుకు మజీద్- ఎ- ఈబాదుర్ రెహమాన్ కమిటీ వారు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు....
-----------------------
Admin