Wednesday, 29 July 2026 02:39:34 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు...

Date : 08 March 2024 10:57 AM Views : 459

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లతా, ప్రియాంక ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమాజ సేవలో మహిళలు ముందు ఉండటం, ఓర్పు, సహనంతో కుటుంబాలను తీర్చిదిద్దుతారని మహిళలలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగతిలో ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ జిల్లాలో అదనపు కలెక్టర్లు ఇద్దరు కూడా మహిళలు కావటం చాలా అదృష్టం గా భావిస్తున్నాని, వారి సహకారం తో జిల్లాను అభివృద్ధి లో ముందుంజలో ఉంచుతాన్నని, అర్హులైన వారు చివరి వరసలో ఉన్నవారికి పథకాలు అందేలా కృషి చేస్తాన్నాని తెలిపారు. ఈ జిల్లాలో ఉన్న మహిళలు గ్రూప్ లగా ఏర్పడి, బ్యాంక్ ల ద్వారా లోన్లు తీసుకొని నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేస్తూ మన జిల్లాలోనే కాదు వేరే జిల్లాలకు కూడా ఎగుమతి చేయటం శుభపరిణామం అని తెలిపారు. పి ఎం ఎఫ్ ఎం లో మన జిల్లాను మొదటి ర్యాంక్ లో ఉంచిన్నందుకు మహిళలందరికి కృతజ్ఞతలు తెలిపారు.మహిళల కు ఓర్పు, సహనం, సమయ స్ఫూర్తి ఎక్కువ గా ఉంటాయని, మహిళలు ఎక్కడ అయితే పూజిస్తారో అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారని, స్త్రీ లేనిదే మానవ మనుగడ లేదని తెలిపారు.అలాగే పని చేసే ప్రదేశాలలో మహిళలను ఎవరైనా వేధించిన, అగౌరవ పర్చిన వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటాన్నని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు మహిళలు గురించి పాడిన పాటలు బాగున్నాయని వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు. తదుపరి జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ )బి ఎస్ లత మాట్లాడుతూ మహిళలపై ఎవరు వివక్షత చూపరాదని, మన పిల్లలని తప్పటడుగులు వేయకుండా మహిళల పట్ల గౌరవంగా ఉండేలా పెంచాలని, కుటుంబ బంధాలను భాద్యతగా సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. మహిళల కు విద్య, వైద్యం, ఆస్తి, ఓటు హక్కు అనేవి సమానంగా రాజ్యాంగం ద్వారా పొందామని ఈ అవకాశం కల్పించిన అంబేద్కర్ ని కొనియాడారు.మహిళలు అందరు అన్ని రంగాలలో రాణించాలని అలాగే పౌష్టిక ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్బంగా తెలిపారు. తదుపరి జిల్లా కలెక్టర్ వికలాంగులకు ఒక్కొక్క స్కూటీ విలువ 1,25,000 రూపాయలు గల 15 స్కూటీలను , అలాగే ఒక్కొక్క ఛార్జింగ్ బ్యాటరీ తో నడిచే త్రి వీలర్ చైర్ విలువ 80,000 రూపాయలు గల 6 త్రి వీలర్ చైర్లను, సుమారు 25 లక్షల రూపాయలు విలువ గల వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు. వినికిడి లోపం ఉన్న ఎనిమిది మందికి వినికిడి యంత్రాలు అందజేశారు. మాటలు రాని నలుగురు మూగ విద్యార్థులకు చదువుకొనుటకు నాలుగు సెల్ ఫోన్లు అందజేశారు. జిల్లా కలెక్టర్ మహిళా దినోత్సవ సందర్భంగా అదనపు కలెక్టర్ బి ఎస్ లత, ఆదరణ కలెక్టర్ ప్రియాంక,డి ఎం ఓ వెంకట రమణ, జెడ్ పి డిప్యూటీ సి ఈ ఓ శిరీష, ఎస్ సి వెల్ఫర్ ఆపిసర్ లత, అలాగే సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ,మహిళల మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రభుత్వ ఉద్యోగులను లను కలెక్టర్ సన్మానించారు. అనంతరం మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీ, వ్యాసరచన, పాటల పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమం లో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, చివ్వేంల ఎంపీపీ కుమారి,మఠంపల్లి ఎంపీపీ పార్వతి కొండ నాయక్,కోదాడ ఎంపీపీ మల్లెల రాణి, పెన్ పహాడ్ జెడ్ పి టి సి అనిత,కోదాడ జెడ్ పి టి సి మందాలపు కృష్ణ కుమారి, జడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష, ఎస్ సి వెల్ఫేర్ ఆపిసర్ లత,మున్సిపల్ కౌన్సిలర్లు,మహిళ ఉద్యోగులు,అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :