Friday, 08 May 2026 09:24:31 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల...

Date : 31 October 2023 06:37 PM Views : 330

సర్కార్ టీవీ న్యూస్ / తూర్పు గోదావరి జిల్లా : రాజమండ్రి : టీడీపీ అధినేత చంద్రబాబుకు కొంత ఊరట లభించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్‌లో అరెస్టై 52 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు 4 వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదలయ్యారు. చంద్రబాబు విడుదల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్దయెత్తున చేరుకోవడంతో రాజమండ్రి జైలు వద్ద కోలాహలం నెలకొంది. చంద్రబాబు బయటకు వచ్చిన అనంతరం తన మనవడు దేవాన్ష్ కు చంద్రబాబు ముద్దుపెట్టుకున్నారు. అనంతరం జైలు దగ్గరకు వచ్చిన కార్యకర్తలకు అభివాదం తెలిపారు.ఆరోగ్య కారణాలు, కంటి ఆపరేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. నేటి నుంచి నాలుగు వారాల పాటు ఆయనకు బెయిల్‌ మంజూరైంది. ఐదు సాధారణ షరతులు విధిస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జున రావు తీర్పు చెప్పారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, జైల్లో చేసిన ఆరోగ్య పరీక్షలు, వైద్యుల నివేదికలు, చంద్రబాబు వ్యక్తిగత వైద్యుల లేఖలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టు 15 పేజీల తీర్పులో ప్రస్తావించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :