Wednesday, 29 July 2026 12:25:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వరద భాదితులను ప్రభుత్వం ఆదుకోవాలి... -బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 04 August 2023 09:09 AM Views : 452

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ: వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని,వారికి శాశ్వత పరిష్కారం చూపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం పార్టీ శ్రేణులతో కలిసి మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో పర్యటించి భాదితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు ఇండ్లు నీటమునిగి పేద ప్రజలు అపార నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.వర్షాలు బాగా పడినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటుందని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారన్నారు.వరద బారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూడాలని స్వంత స్థలం ఉన్నవారికి గృహలక్ష్మీ పథకం కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని,ఇల్లులేని పేద వారికి ఇంటి స్థలాలు మంజూరు చేసి బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని పేర్కొన్నారు.ప్రతీ కుటుంబానికి నెల రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు అందించాలని,అంటువ్యాధులు ప్రభలకుండా ప్రతీ గ్రామానికి వైద్య బృందాలను పంపి వైద్యంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,జిల్లా మహిళా అధ్యక్షురాలు బండి రమణి,అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు కేతిని కుమారి,కోలా మల్లికా,ఎర్రంశెట్టి రాజేశ్వరి,బాణోత్ లీలా తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :