సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కాంగ్రెస్ పార్టీతోనే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వస్తుందని అందుకే ఆయా గ్రామాల సర్పంచులు తమ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని కాంగ్రెస్ పార్టీ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజక వర్గంలోని జిల్లేడు చౌదరి గూడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ముగ్గురు సర్పంచులు పార్టీలో చేరారు. చౌదర్ గూడా మండలం నుండి మండల పార్టీ అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో కాస్లాబాద్ సర్పంచ్ మోకర్ల రాగోపాల్, మరియు వారితోపాటు 60 మంది పార్టీలో చేరినట్లు ప్రకటించారు. అదేవిధంగా ఎదిర గ్రామ సర్పంచ్ రాపోల్ బాలరాజ్ మరియు వారితో పాటు 80 మంది చింతకుంట తండా సర్పంచ్ హరి నాయక్, మరియు వీరితోపాటు 60 మంది అనుచరులు,వార్డు సభ్యులు పి. చంద్రయ్య, లక్ష్మీ మల్లేష్, లింగని అంజయ్య, వీరితోపాటు మూడు గ్రామాల నుండి ఛాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ వారి ఉద్దేశించి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కోటకు బీటలు వారాయని ఇంకా మునుముందు పెద్ద ఎత్తున భారీ చేరికలు ఉన్నాయని ఎంతోమంది నియోజకవర్గంలో కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని శంకర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ నర్సింలు, ఎంపీపీ తనయుడు ఆంజనేయులు, మురుగని రాములు, జక్కని రామచంద్రయ్య, యాదయ్య, బాసు యాదయ్య, ఆకుల నర్సింలు, కావలి యాదయ్య, వడ్ల కృష్ణయ్య, బుడుగోనిపల్లి అంజయ్య, గాలిగూడా సర్పంచ్ యాదయ్య, సత్యనారాయణ రెడ్డి, వెంకట్ నర్సింహారెడ్డి, సురేష్ ,శీను, మోహన్ పూజ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin