సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డి పల్లి : అన్నపురెడ్డిపల్లి మండలం రెవెన్యూ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. వీఆర్ఏ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన సంగతి తెలిసిందే అయితే వారికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ తెలియజేశారు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జీవో ని అమలు చేశారు. ఆ జీవో కాపీని జేఏసీ నేతలకు సోమవారం సీఎం కేసీఆర్ అందజేశారు వీఆర్ఏలను వీఆర్వోలను వివిధ శాఖల్లో ఉద్యోగ నిమిత్తం సర్దుబాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది వాళ్ళ పోరాటానికి వాళ్ల కష్టానికి ప్రతిఫలంగా భావిస్తూ మళ్లీ తిరిగి ఉద్యోగ బాధ్యతలు చేపట్టడానికి ప్రభుత్వం సహకరించడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసినారు. సీఎం కెసిఆర్ కి మరియు టిఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది శ్రీనివాసరావు, శ్రీ వాణి, మోహన్, ఇంకా కొంతమంది సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin