సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట మండలం మామిళ్ళ వారి గూడెం గ్రామపంచాయతీ లో BRS గ్రామ కమిటీ అధ్యక్షున్ని, కార్యదర్శిని మరియు సభ్యుల్ని అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు సమక్షాన ఎకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షులుగా బోడపాటి సత్యనారాయణ, కార్యదర్శిగా తాండ్ర యుగంధర్, ఉపాధ్యక్షులుగా ఉప్పల రత్నాకర్, జాయింట్ కార్యదర్శి యసం శ్రీను, కోశాధికారిగా ఎస్ కే రెహమాన్, ఆర్గనైజర్ గా మైదుకూరి నాగమహేశ్వరరావును ఏకగ్రీవంగా ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరావు మాట్లాడుతూ గెలిచేది మన బిఆర్ఎస్ పార్టీ నే నన్ను నమ్మిన వాళ్లని నేను దూరం చేసుకోను నా వాళ్ళ పక్కనే నేనుంటాను నాకు నా పార్టీ కార్యకర్తలు అందరూ సహకరించి నాతో నడుస్తారని నేను నమ్ముతున్నాను. మా పార్టీకి తోడుగా ఉండండి అని తెలియజేశారు. అంతేకాకుండా రేపటి నుంచి పార్టీ ఎన్నికల కార్యక్రమాలు మరియు ఎన్నికల ప్రచారం జరపబడుతుందనీ, తెలిపారు పార్టీ కార్యకర్తలు సహకరించాలని దీనికి అధ్యక్షులు గ బోడపాటి సత్యనారాయణ వుంటారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూరపాటి నరేష్, వనం బాబురావు, వీరనాల బ్రహ్మం , మిండా శ్రీనివాసరావు కూరపాటి వేంకటేశ్వరరావు కోర్స ప్రతాప్, పొట్ట రాము, శింగలదేవి చిన్న సత్యనారాయణ, డా.అజిజ్ రామినేని సత్యనారాయణ, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin