సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు దేవరం రామకృష్ణారెడ్డి నీ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాం బాబు,రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘువరన్ ఆచార్యులు రాష్ట్ర ప్రచార కార్యదర్శి గడిగుండ్ల రాము ఇంకా రాష్ట్ర కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ లో చేరిన నాటి నుండి హుజూర్ నగర్ నియోజకవర్గంలో అసోసియేషన్ బల పరచడంలో రామకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారని పనిచేసే ప్రతి ఒక్కరికి సరైన సమయంలో మంచి గుర్తింపు ఉంటుందని అసోసియేషన్ అధ్యక్షుడు కందుకూరి యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి కి శుభాకాంక్షలు చెప్పారు ..
-----------------------
Admin