సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం దేశాయిపల్లె గ్రామానికి చెందిన బీసీ నాయకులు మాజీ ఎంపిటిసి జిల్లెల సాయికుమార్ శనివారం రాత్రి గుండె పోటుతో మరణించగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. డ్యాగల శ్రీనివాస్ తో పాటు యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి కానుగుల కుమారస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి మట్ట రమేష్ యాదవ్, మండల ఉపాధ్యక్షుడు చొప్పరి భాస్కర్ ముదిరాజ్ లు సాయికుమార్ పార్ధివదేహానికి పూలు వేసి నివాళులు అర్పించారు.
-----------------------
Reporter