సర్కార్ టీవీ న్యూస్ / పెద్దపల్లి జిల్లా : శేరిలింగంపల్లి డివిజన్ లొ గ్రేటర్ హైదరాబాద్ మిల్లర్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు వాకిటి నాగరాజు పిలుపు మేరకు గౌలిదొడ్డి స్థానిక జి. ఎచ్.ఎం.సి,ఆఫీస్ ముందు కాంక్రీట్ మిల్లర్స్అండ్ లేబర్స్ అసోసియేషన్ గౌలిదొడ్డి సంఘం.ఆధ్వర్యంలో నిరసన చెపట్టారు.ఆర్ టీ ఓ అధికారులు. ఇష్టమొచ్చినట్లు చలనలు రాస్తున్నారని రవాణా అధికారులకి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిల్లర్స్ అండ్ లేబర్ సంఘము అధ్యక్షుడు శాంతయ్య. రవాణా అధికారుల వైకిరి పై మండిపడుతూ ట్రాక్టర్లు, మిల్లర్ల పై చట్టవిరుద్ధమైన జరిమానాలు రాస్తున్నారని. ట్రాక్టర్ కి సంబంధించిన అన్ని కాగితాలు ఉన్నపటికీ టోషన్ కి పర్మిషన్ లేదని రోడ్డుపై ట్రాక్టర్ మరియు బొలెరో లను ఆపి ఇష్టం వచ్చినట్టు అక్రమంగా డబ్బులు వసూలు చేయడం కార్మికుని యొక్క నడ్డి విరవడమే కాకుండా ఉపాధి లేకుండా చేస్తున్నారు అని వాపోయారు.ఒక్కరోజు పని చేస్తే వెయ్యి నుంచి పదిహేను వందలు మిలగడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఒక్కో మిల్లర్ వ్యక్తి దగ్గర ఐదు వేల నుండి పదివేల వరకు చలనులు రాస్తు అధికారులు కార్మికుల పొట్ట కొడుతున్నారాని,ఈ ఆర్ టీ ఓ పై అధికారులు పాటించుకొని మా పేదవాడి రెక్కల కష్టాన్ని దోచుకోవడం న్యాయమా, వేడుకుంటున్నారు అక్రమంగా వసూలు చేస్తున్న అధికారుల్లారా మీ యొక్క అక్రమ వసూళ్లను తక్షణమే ఆపక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లర్ మరియు భవన నిర్మాణ కార్మికులుతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తాం అలాగే హైదరాబాద్ లో ఉన్న మిల్లర్ ట్రాక్టర్ లను అసెంబ్లీ గేట్ ముందు నిలిపి నగరాన్ని దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలొ మిల్లర్స్ అండ్ లేబర్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం సభ్యుడు కుందేలు మరియు కార్మికులు పాల్గొన్నారు.
-----------------------
Reporter