సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం పొనుగోడు లో ఇటీవల వెలువడిన ఎస్‌ఐ ఫలితాల్లో ఉద్యోగం సాధించిన మల్లికంటి మౌనిక తండ్రి శ్రీనివాస్ కు బహుజన్ సమాజ్ పార్టీ గరిడేపల్లి మండల అధ్యక్షులు అమరవరపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జిల్లా ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ శాలువా కప్పి సన్మానించారు .ఈ కార్యక్రమం లో నవీన్ కుమార్ మాట్లాడుతూ పట్టుదల ఉంటే సాధించలేనిదేమీ లేదని నిరూపించింది అని నిరుపేద కుటుంబం లో పుట్టి, రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. బాల్యం నుంచే అమ్మానాన్నల కష్టాన్ని కండ్లారా చూసి పెరిగి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని సంకల్పించారు. చదువే లోకంగా కష్టపడి ఎస్‌ఐ కొలువుసాధించడం అభినందనియం అని ఎస్‌ఐ ఫలితాల్లో సత్తాచాటి, కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దపంగ ఉపేందర్, నియోజకవర్గ ఇంచార్జి కొండమిది నర్సింహా రావు, ఉపాధ్యక్షలు జీలకర్ర రామస్వామి, సోషల్ మీడియా గండమళ్ళ వీరంజీ, బొజ్జా పవన్ కుమార్, అదూరి అజయ్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin