సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో రైతులకు ఆయిల్ ఫామ్ పంటసాగు పై అవగాహన సమావేశం నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగు కొరకు ఎస్సీ, ఎస్టీలకు 100% రాయితీ సన్న కారు చిన్న రైతులకు 90 శాతం రాయితీ, ఇతర రైతులకు 80 శాతం రాయితీపై మొక్కలను మరియు డ్రిప్పును అందజేస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ పండించే రైతులకు అంతర్ పంటల సాగు కింద రైతులకు ప్రత్యేకంగా రాయితీని ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. బాల్కొండ మండలంలో 40 ఎకరాల సాగు కొరకు ప్రభుత్వం రాయితీని ప్రకటించగా ఇప్పటివరకు 25 ఎకరాలకు రైతులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మిగిలిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. జలాల్పూర్ గ్రామ శివారులో గంగారెడ్డి అనే రైతు పండిస్తున్న ఆయిల్ ఫామ్ పంట సాగును పరిశీలించి రైతులకు సూచనలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లింభారెడ్డి ఏఈఓ కృష్ణవేణి, రైతులు పాల్గొన్నారు....
-----------------------
Admin