సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలంలో బిజెపి శక్తి కేంద్రం ఇన్చార్జి సమావేశంలో రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సతీష్ కుమార్ మాట్లాడుతూ శక్తి కేంద్రం ఇన్చార్జిలు మరియు బూత్ అధ్యక్షులకు పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు .రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలు మరియు నిధుల గురించి గడపగడపకు తిరిగి విస్తృత ప్రచారం చేయాలని దిశా నిర్దేశం చేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి జాడి లక్ష్మి, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు అంకాల దుర్గ, రామెల్ల లక్ష్మీ శేఖర్, సీనియర్ నాయకులు హేమ సుందర్, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి, గిరిజన మోర్చా అధ్యక్షుడు మట్టి రమేష్, యువ మోర్చా ఉపాధ్యక్షుడు శ్రీ కిషన్, యువమోర్చా కార్యదర్శి నవీన్, కిసాన్ మోక్ష అధ్యక్షుడు తోట సతీష్, ఆదినారాయణ, బోటా నవీన్ తదితర కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
-----------------------
Admin