Saturday, 12 September 2026 08:17:48 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రభుత్వ బడులను ప్రజలే కాపాడాలి... -ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

Date : 02 June 2023 07:20 AM Views : 353

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు: ప్రభుత్వ పాఠశాలలను ప్రజలే కాపాడుకోవాలని, విద్యార్థుల శాతం పెరగకుంటే, సర్కారీ బడులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని బొత్తలపాలెం గ్రామంలో గురువారం తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో, ఆ వేదిక రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సర్కారీ బడుల్లో విద్యార్థులు తగ్గిపోవడానికి, ప్రైవేట్ పాఠశాలల్లో పెరగడానికి గల కారణాలను, క్షేత్రస్థాయిలో వారి నుండి తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యాధికారులు,ప్రధాన ఉపాధ్యాయుల నుండి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 120 కి తగ్గకుండా విద్యార్థులు ఉంటే, ఐదుగురు టీచర్లను నియమించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఒప్పిస్తామని తెలిపారు. తరగతి గదిలో విద్యార్థుల శాతం తక్కువగా ఉంటే జరిగే నష్టాన్ని వివరించారు.ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సమాజంలోని ప్రజలందరికీ నాణ్యమైన విద్య అందాలన్నది తమ వేదిక లక్ష్యమని తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయం చేసుకొని, ఆర్థికంగా చితికి పోతూ ప్రైవేటు బడులకు పంపిస్తున్న, కుటుంబాలను కలిసి సర్కారీ బడులకు విద్యార్థులు వచ్చేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు.22 లక్షల రూపాయలతో మన ఊరి మనబడి కార్యక్రమం కింద గ్రామంలో ప్రాథమిక పాఠశాల అన్ని సౌకర్యాలను కలిగి ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ, తల్లిదండ్రులకు తరగతి గదులు తదితర వసతులను చూయించాలని కోరారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్న సర్కారీ బడుల్లో మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత, ప్రభుత్వ ఆజమాయిషి లోపించడం తదితర కారణాలతో, ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం సన్నగిల్లుతుందని, 23 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అటెండర్ వ్యవస్థను పునరుద్ధరించాలని మండల ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్ ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామసర్పంచ్ భోగాల వీరారెడ్డి,ఎంపీటీసీలు పిన్నెల్లి ఉపేందర్,దొంగల వెంకటయ్య, మీసాలఉపేందర్, ఉపసర్పంచ్ అందె వెంకటయ్య, గ్రామ పాలకవర్గం, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అనంత ప్రకాష్ లు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు,విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి, కొంతవరకైనా ఒప్పించి విద్యార్థుల శాతాన్ని పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంగ,జిల్లా అధ్యక్షులు ధనమూర్తి, కార్యదర్శి గుండాబిక్షపతి, ఎంఈఓ శత్రునాయక్, హుజూర్నగర్ డివిజన్ కార్యదర్శి వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పగడాల మట్టేష్,సుంకరి క్రాంతి, ప్రధానోపాధ్యాయులు భరణి కుమార్,రెడ్డిపల్లిశ్రీనివాస్,వడ్డే సైదయ్య, అందే రాజు, వెంకటేశ్వర్లు విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: